సూర్య కుమార్ యాద‌వ్ ఎమోషన‌ల్

సంచ‌ల‌నంగా మారిన కెప్టెన్ కామెంట్స్

అహ్మ‌దాబాద్ : త‌న సార‌థ్యంలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండుసార్లు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్. ఇది అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఆడ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నాడు. ఇది జీవితంలో మ‌రిచి పోలేని క్ష‌ణాల‌ని పేర్కొన్నాడు. త‌ను క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. టైటిల్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగ సంజ్ఞ వైరల్ అవుతోంది సమ్మిట్ పోరులో భారత్ న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించడంలో సంజు సామ్సన్ , జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. సామ్సన్ , అభిషేక్ శర్మ అర్ధ సెంచరీలు చేయడంతో భారతదేశం 255 పరుగుల భారీ స్కోరును సాధించింది, దీనికి ప్రతిస్పందనగా, న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది, జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

గెలుపొందిన అనంత‌రం సూర్య భాయ్ తీవ్ర ఎమోష‌న‌ల్ కు లోన‌య్యాడు. భారత కెప్టెన్ పిచ్ మధ్యలోకి నడిచి తన చేతితో మట్టిని తాకి, ఆపై గౌరవ ప్రదంగా తన నుదిటిపై ఉంచాడు. ఇది భారతదేశం విజయం సాధించిన పిచ్ , మైదానం పట్ల కృతజ్ఞతా సంజ్ఞ. ఇదిలా ఉండ‌గా సంజు శాంస‌న్ ఆడిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. త‌న వ‌ల్ల‌నే ఇవాళ ఇండియా ఫైన‌ల్ కు రాగ‌లిగింద‌ని, క‌ప్ గెలుచుకున్న‌ట్లు తెలిపాడు. త‌ను విండీస్ తో 97, ఇంగ్లండ్ తో 89, ఫైన‌ల్ లో న్యూజిలాండ్ తో మ‌రో 89 ప‌రుగులు చేశాడు. మొత్తం 321 ర‌న్స్ తో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా ఎన్నిక‌య్యాడు.

Leave A Reply

Your Email Id will not be published!