Naresh Tikait : మహిళా రెజ్లర్లకు రైతన్నల మద్దతు
ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం కావాలి
Naresh Tikait : మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసన మరింత తారాస్థాయికి చేరింది. తాజాగా సంచలన ప్రకటన చేశారు సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత నరేష్ టికాయత్(Naresh Tikait). లైంగికంగా, మానసికంగా, శారీరకంగా తమను వేధిస్తున్నాడంటూ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు రెజ్లర్లు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. తాజాగా వారంతా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము సాధించిన పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు.
దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న రైతు నాయకులు వెంటనే కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు మహిళా రెజ్లర్ల నిరసనకు తాము ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి రైతు నాయకులు వెంటనే సమావేశం కావాలని కోరారు. ఈ సందర్భంగా రైతు నేత నరేష్ టికాయత్ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై, ప్రధాని మోదీపై, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై నిప్పులు చెరిగారు.
వీరి నిర్వాకం వల్లనే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెచ్చి పోతున్నాడని ఆరోపించారు. వెంటనే అతడిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. లేక పోతే రైతులంతా కదం తొక్కడం ఖాయమన్నారు. దీంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేసింది. శాంతియుతంగా పోరాడుతున్న మహిళా రెజ్లర్లపై ఎలా కేసులు నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు నరేష్ టికాయత్.
Also Read : Free Bus Travel