SL vs AFG Asia Cup 2022 : చెల‌రేగిన ఆఫ్గనిస్తాన్ చిత్త‌యిన శ్రీ‌లంక

ఆసియా క‌ప్ లో 8 వికెట్ల తేడాతో గెలుపు

SL vs AFG Asia Cup 2022 : స్వ‌దేశంలో అటు పాకిస్తాన్ ఇటు ఆస్ట్రేలియాను ముప్పు తిప్ప‌లు పెట్టిన శ్రీ‌లంక అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆసియా క‌ప్ -2022 ను స్టార్ట్ చేసింది.

ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌ర్ 17 దాకా ఈ మెగా టోర్నీ కొన‌సాగుతుంది. శ్రీ‌లంక‌, ఆఫ్గ‌నిస్తాన్ ల మ‌ధ్య(SL vs AFG Asia Cup 2022) ఇది ప్రారంభ మ్యాచ్. ఇవాళ మ‌రో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఆఫ్గ‌నిస్తాన్ అద్భుమైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో లంక‌ను ప‌రాజ‌యం పాలు చేసింది. కేవ‌లం 106 ప‌రుగుల స్వ‌ల్ప టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించింది.

దీంతో టోర్నీలో బోణీ కొట్టింది ఆఫ్గ‌నిస్తాన్. ఇక మైదానంలోకి దిగిన ఆఫ్గ‌న్ ఓపెన‌ర్లు హ‌జ్ర‌తుల్లా జ‌జాయ్, ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ మొద‌టి వికెట్ కు ఏకంగా 83 ర‌న్స్ భాగస్వామ్యాన్ని నెల‌కొల్పారు.

కేవ‌లం 10.1 ఓవ‌ర్ల‌లోనే రెండు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది ఆఫ్గ‌నిస్తాన్. జ‌జాయ్ 37 ర‌న్స్ చేస్తే గుర్భాజ్ 40 ప‌రుగుల‌తో స‌త్తా చాటారు. ఇక శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో హ‌స‌రంగా ఒక్క‌డే ఒక వికెట్ సాధించాడు.

అంత‌కు ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక జ‌ట్టు 105 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఆఫ్గనిస్తాన్ బౌల‌ర్ల ధాటికి బెంబేలెత్తి పోయారు. ఫారూఖీ మూడు వికెట్లు తీస్తే న‌బీ , ముజీబ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇక శ్రీ‌లంక ఇన్నింగ్స్ లో భానుక రాజ‌ప‌క్స ఒక్క‌డే రాణించాడు. 38 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇక టోర్నీలో ఆదివారం భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Also Read : దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!