SL vs AFG T20 World Cup : ఆఫ్గనిస్తాన్ పై శ్రీలంక గ్రాండ్ విక్టరీ
హాఫ్ సెంచరీతో మెరిసిన డిసిల్వా
SL vs AFG T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ -2022లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంక ఆఫ్గనిస్తాన్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది. బ్రిస్బేన్ వేదికగా గ్రూప్ -1 మ్యాచ్ లో మంగళవారం శ్రీలంక జట్టు(SL vs AFG T20 World Cup) ఆరు వికెట్ల తేడాతో సత్తా చాటింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టు 145 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. అనంతరం మైదానంలోకి దిగిన శ్రీలంక లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. లంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
శ్రీలంక 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపు అందుకుంది. ఇదిలా ఉండగా మ్యాచ్ చివరి దాకా ధనంజయ నిలిచి ఉన్నాడు. కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డిసిల్వా 6 ఫోర్లు 2 భారీ సిక్సర్లతో రెచ్చి పోయాడు. 66 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక ధనంజయతో పాటు మెండిస్ 25 పరుగులు చేస్తే అసలంక 19, రాజపక్స 18 పరుగులతో రాణించారు.
ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో రెహ్మాన్ కు 2 వికెట్లు లభించగా రషీద్ ఖాన్ కు మరో రెండు వికెట్లు దక్కాయి. ఇక గ్రూప్ ల వారీగా చూస్తే ప్రస్తుతం శ్రీలంక నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీలంక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. కానీ ఇంకా సెమీస్ వెళ్లేందుకు ఎదురు చూస్తోంది.
మరో వైపు గ్రూప్ 2లో పాకిస్తాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ జట్టు మూడు మ్యాచ్ లు ఆడింది ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
Also Read : టి20 వరల్డ్ కప్ టీమిండియాదే – మిథాలీ రాజ్