SL vs IRE T20 World Cup : ఐర్లాండ్ పై శ్రీలంక గ్రాండ్ విక్టరీ
9 వికెట్ల తేడాతో పరాజయం
SL vs IRE T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -12 లీగ్ మ్యాచ్ లో శ్రీలంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఐర్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో(SL vs IRE T20 World Cup) 9 వికెట్ల తేడాతో విక్టరీ సాధించి ముందుకు దూసుకు వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ శ్రీలంకకు ఒక బూస్ట్ లాగా ఉపయోగి పడింది అని చెప్పక తప్పదు.
ఇప్పటికే శ్రీలంక యూఏఈ వేదికగా ఈ ఏడాది 2022 జరిగిన ఆసియా కప్ లో పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి విజేతగా నిలిచింది. టి20 వరల్డ్ కప్ లో ప్రారంభంలోనే శ్రీలంకకు కోలుకోలేని షాక్ ఇచ్చింది నమీబియా జట్టు.
దీంతో సూపర్ 12కు అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది శ్రీలంక. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐర్లాండ్ జట్టుపై ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చింది.
ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు ప్రత్యర్థి జట్టుకు. టాస్ గెలిచిన ర ఐర్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎక్కడా పరుగులు తీయనీయలేదు.
దీంతో ప్రత్యర్థి జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 128 రన్స్ మాత్రమే చేసింది. ఇక ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ , పాల్ స్టిర్లింగ్ మాత్రమే కొంచెం సేపు ఆడారు. పరువు పోకుండా కాపాడారు.
టెక్టర్ 45 రన్స్ చేస్తే స్టిర్లింగ్ 34 పరుగులతో రాణించాడు. మేలనిపించారు. లేకపోతే సింగిల్ డిజిట్ కే ఐర్లాండ్ పరిమితం అయ్యేది. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక అద్భుతంగా ఆడారు.
డిసిల్వా, కుశాల్ మెండిస్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. డిసిల్వా 32 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మెండిస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.15 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది.
Also Read : దాయాదుల పోరులో దాదా ఎవరో