SLBC Tunnel Collapse : టన్నెల్ వద్ద కీలక బృందాలతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
భారీ మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు...
SLBC Tunnel : ఆపరేషన్ SLBC టన్నెల్‌లో భాగంగా, లోకోమోటివ్ ట్రైన్ ద్వారా భారీ జనరేటర్‌ను సొరంగంలోకి పంపించారు. దీనితో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్‌లతో రెస్క్యూ టీమ్‌లు సొరంగంలోకి ప్రవేశించాయి. టన్నెల్(Tunnel)లో మట్టి, బురద నీరు అధికంగా ఉండటంతో, రెస్క్యూ టీమ్‌లకు అక్కడి వరకు చేరుకోవడంలో కాస్త ఆటంకాలు ఏర్పడుతున్నాయని నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్ తెలిపారు. భారీ మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు.
SLBC Tunnel Collapsed
SLBC టన్నెల్ సమీపానికి చేరుకున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు, కాంట్రాక్టు ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. టన్నెల్ దగ్గర జరుగుతున్న సహాయక చర్యల గురించి అధికారులు మంత్రులకు వివరించారు. ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడమే తమ ప్రధాన లక్ష్యం అని మంత్రి ఉత్తమ్ తెలిపారు. టన్నెల్ పైనుంచి, పక్క నుంచి తవ్వే అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
SLBC టన్నెల్ కూలిన ప్రాంతంలో పైకప్పు నుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో సమీక్షించినప్పుడు, కొండపై నుంచి టన్నెల్‌లోకి చేరుకోవడానికి సుమారు 450 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. SLBC టన్నెల్ పైకప్పు కూలడంతో మట్టి, బురద నీరు భారీగా చేరుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రెస్క్యూ టీమ్‌లు మినిట్లు కూడా వృథా చేయకుండా మట్టి, బురదనీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ ఫోన్ చేసి, ఎస్‌ఎల్‌బీసీ సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన విధానం, సహాయక చర్యలపై ఆరా తీశారు.
Also Read : Vijayawada CP-Phone Thefting : ఫోన్ దొంగతనాలపై సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు