Smriti Irani Jaiswal : జైస్వాల్ ఆటకు స్మృతీ ఇరానీ ఫిదా
ఇలాంటి యువకులు దేశానికి కావాలి
Smriti Irani Jaiswal : ఒకప్పుడు తండ్రితో పాటు పానీ పూరీలు అమ్మిన కుర్రాడు ఇవాళ దేశం గర్వించే స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదన్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani). ఆమె యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కుర్రాడు ఒకప్పుడు అష్ట కష్టాలు పడ్డాడు. కానీ ఆట పట్ల తనకు ఉన్న ఆసక్తిని మాత్రం మరిచి పోలేదు. అన్నింటిని ఓర్చుకుని జాతీయ జట్టుకు ఎంపిక కావడం మామూలు విషయం కాదని కితాబు ఇచ్చారు ఇరానీ.
ప్రధానంగా అతడిలోని టాలెంట్ ను గుర్తించింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. అతడిని ఏరికోరి ఐపీఎల్ కు తీసుకుంది. ఏదో సాధించాలన్న తపనకు మరింత పదును పెట్టేలా చేశాడు కోచ్ కుమార సంగక్కర, వెన్ను తట్టి ప్రోత్సహించాడు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఈసారి దేశంలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో దుమ్ము రేపాడు. దంచి కొట్టాడు. అత్యధిక స్కోర్ సాధించి ఔరా అనిపించేలా చేశాడు.
టీ20 ఫార్మాట్ లో అసాధారణమైన రీతిలో ప్రదర్శన చేసిన యశస్వి జైస్వాల్ ను ఉన్నట్టుండి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టెస్టుకు ఎంపిక చేసింది. ఇది విస్తు పోయేలా చేసినా వారి నమ్మకం వమ్ము చేయలేదు. ఆడిన తొలి టెస్టు లోనే సెంచరీతో సమాధానం చెప్పారు. 171 రన్స్ చేశాడు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇలాంటి యువకులే దేశానికి కావాలని కోరారు.
Also Read : Daggubati Purandeswari : బీజేపీ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి