Smriti Irani : నా సోద‌రుడిని కోల్పోయా – స్మృతీ ఇరానీ

రాకేష్ ఝున్ ఝున్ వాలా మ‌ర‌ణంపై

Smriti Irani : భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం, ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్ గా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలా ఆక‌స్మిక మ‌ర‌ణంపై ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. ఆయ‌న లేర‌న్న వార్త‌ను జీర్ణించు కోలేక పోతున్నారు.

తాజాగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) స్పందించారు. ఝున్ ఝున్ వాలా వార‌స‌త్వం చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక ర‌కంగా తాను సోద‌రుడిని కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు ఆయ‌న బాద్ షా లాంటి వాడు. ఎంతో నేర్చు కోవాల్సి ఉంది రాకేష్ తో అని పేర్కొన్నారు మంత్రి. చాలా మంది క‌ల‌లు మాత్రమే కంటారు. కానీ రాకేష్ ఝున్ ఝున్ వాలా క‌ల‌లే కాదే వాటిని సాకారం చేసి చూపించారు.

మ‌న‌కు ఆయ‌న‌కు ఉన్న తేడా అని పేర్కొన్నారు స్మృతీ ఇరానీ. ఇవాళ నాకు ఏం మాట్లాడాలో తెలియ‌డం లేదు. చాలా బాధ‌గా ఉంది. అంత‌కంటే ఎక్కువ‌గా క‌న్నీళ్లు వ‌స్తున్నాయి.

ఆయ‌న‌తో సంభాషించిన స‌మ‌యంలో ఎన్నో విష‌యాలు తాను తెలుసు కోగ‌లిగాన‌ని వెల్ల‌డించారు కేంద్ర మంత్రి. ఆనాటి గుర్తులు ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌న్నారు.

ఇవాళ నేను రాకేష్ ఝున్ ఝున్ వాలాను అన్న‌య్య‌గానే భావిస్తాను. చాలా మందికి తెలియ‌దు. కానీ మా ఇద్ద‌రి మ‌ధ్య సోద‌ర‌, సోద‌రీమ‌ణుల సంబంధం ఉంద‌న్నారు స్మృతీ ఇరానీ.

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె త‌న నివాళిని అర్పించారు. రాకేష్ అన్న‌య్య నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంద‌న్నారు కేంద్ర మంత్రి.

Also Read : మోదీ స‌ర్కార్ పై మ‌నీశ్ సిసోడియా ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!