Smriti Irani Viral : స్మృతీ ఇరానీ మ‌ణిపూర్ మాటేంటి

రాహుల్ ఫ్ల‌యింగ్ కిస్ స‌రే

Smriti Irani Viral : కేంద్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ నెట్టింట్లో వైర‌ల్ గా మారారు. తాజాగా ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మాపంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్ లో ప్రోగ్రాం ఉందంటూ వెళ్లి పోయారు. అలా వెళుతూ త‌న‌కు ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి(Smriti Irani) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Smriti Irani Viral On Social Media

ఓ వైపు మణిపూర్ కాలి పోతుంటే ఇలాంటి చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బబు అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌ణిపూర్ లో బ‌త‌క‌లేక మానసిక క్షోభ అనుభ‌విస్తున్న వారి ప‌రిస్థితి ఏంటి అని నిల‌దీస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణిపూర్ లో హింస‌, అల్ల‌ర్లు త‌గ్గ‌లేదు. 10 వేల మంది ఆర్మీ, పోలీసు బ‌ల‌గాల‌ను దించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇదే స‌మ‌యంలో అద‌నంగా మ‌రో 5 వేల మందిని పంపించిన‌ట్లు లోక్ స‌భ సాక్షిగా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ప్ర‌క‌టించ‌డం దేనికి సంకేత‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

కేంద్ర మంత్రి చేసిన ఆరోప‌ణ కేవ‌లం మ‌ణిపూర్ ను కావాల‌ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకేన‌ని అర్థ‌మై పోయింద‌న్నారు.

Also Read : Raghav Chadha : ప్ర‌శ్నిస్తే స‌స్పెండ్ చేస్తారా – రాఘ‌వ్ చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!