Snehashish Ganguly : ఎవరీ స్నేహశిష్ గంగూలీ అనుకుంటున్నారా. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ గా ఉన్న సౌరవ్ గంగూలీకి స్వయాన సోదరుడు. ప్రస్తుతం ఆయన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు కార్యదర్శిగా ఉన్నారు.
సాహా వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో శ్రీలంక టూర్ సందర్భంగా ఎంపిక చేసిన టీమ్ లో వృద్ధిమాన్ సాహాను తప్పించారు.
అతడితో పాటు రహానే, పుజారా, ఇషాంత్ శర్మలను పక్కన పెట్టారు. మిగతా ముగ్గురు ఆటగాళ్లు తమను ఎంపిక చేయక పోవడంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
కానీ సాహా మాత్రం గంగూలీ తనను ఎంపిక చేస్తానని హామీ ఇచ్చాడని కానీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం రిటైర్మెంట్ గురించి ఆలోచించమని సూచించాడని బాంబు పేల్చాడు.
అంతే కాకుండా దాదా తనకు వాట్సాప్ ద్వారా పెట్టిన మెస్సేజ్ ను కూడా బట్ట బయలు చేశాడు. మరో వైపు ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బెదిరించాడంటూ వార్తల్లో నిలిచాడు.
దీంతో సాహా వ్యవహారంపై తీవ్రంగా స్పందించాడు గంగూలీ సోదరుడు స్నేహాశిష్ గంగూలీ(Snehashish Ganguly). తన బ్రదర్, బీసీసీఐ చీఫ్ గంగూలీ ఏదో బాగా ఆడాడని ప్రోత్సహించేందుకు మెస్సేజ్ పెట్టి ఉండవచ్చు.
కానీ బీసీసీఐ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇలా పబ్లిక్ గా బహిర్గతం చేయకూడదని మండిపడ్డారు. దాదాకు ఉన్న గౌరవం అలాగే ఉంటుందని కానీ నష్ట పోయేది మాత్రం నువ్వేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన పనులు చేయొద్దంటూ సూచించాడు.
Also Read : ఎండా కాలంలో ఐపీఎల్ పండగ