Bilkis Bano Agitation : బిల్కిస్ బానో కోసం పాదయాత్రకు సిద్ధం
దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్
Bilkis Bano Agitation : బిల్కిస్ బానో దేశాన్ని కుదిపేసిన పేరు. 2002లో గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న మారణ హోమానికి ఆమె సజీవ సాక్ష్యం. అంతే కాదు తనను సామూహికంగా అత్యాచారం చేశారు.
రేప్ నకు గురైన సమయంలో బిల్కిస్ బానో(Bilkis Bano) గర్భవతిగా ఉన్నారు. తన కళ్ల ముందే చిన్నారిని చిదిమేశారు. ఆపై తన కుటుంబీకులను దారుణంగా హత్య చేశారు. కానీ బానోకు న్యాయం లభించ లేదు.
బాధితురాలు ధైర్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కీలక తీర్పు వెలువరించింది. మొత్తం బిల్కిస్ బానో కేసులో పాల్గొన్న వారిని దోషులుగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఇదిలా ఉండగా సుదీర్ఘ విరామం తర్వాత శిక్షకు గురైన వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ గుజరాత్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారిని విడుదల చేసింది.
విచిత్రం ఏమిటంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15న వారికి విముక్తి కల్పించింది. ఆపై నేరానికి పాల్పడి, శిక్షకు గురైన వారంతా హీరోలుగా తిరిగి వచ్చారు.
వారికి కుటుంబీకులు, సన్నిహితులు ఘనంగా స్వాగతం పలకడమే కాదు సన్మానం చేశారు. ఆపై స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై
దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
6 వేల మందికి పైగా మహిళలు, హక్కుల కార్యకర్తలు, మేధావులు, జర్నలిస్టులు ఆమెకు న్యాయం చేయాలని, దోషులను తిరిగి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజాగా బిల్కిస్ బానోకు మద్దతుగా పాదయాత్ర(Bilkis Bano Agitation) చేపట్టనున్నారు. దాహోడ్ జిల్లా రంధిక్ పూర్ నుంచి అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం వరకు 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
హిందూ ముస్లిం ఏక్తా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, సందీప్ పాండే పాల్గొననున్నారు.
Also Read : మహిళలకు అశోక్ గెహ్లాట్ తీపికబురు