Kailash Satyarthi : స‌మాజ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త

నోబెల్ గ్ర‌హీత కైలాష్ స‌త్యార్థి

Kailash Satyarthi : నోబెల్ శాంతి బ‌హుమ‌తి పుర‌స్కార గ్ర‌హీత కైలాష్ స‌త్యార్థి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌రంగ‌ల్ లో ఏర్పాటు చేసిన విద్యార్థులు- విద్య దాని ప్రాముఖ్య‌త అనే అంశంపై ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ప్ర‌తి ఒక్క‌రు క‌ల‌లు కంటేనే ఏమైనా చేయ‌గ‌ల‌మ‌న్నారు.

ఆక‌లి అన్నింటిని తెలుసుకునేలా చేస్తుంది. అదే అవ‌స‌రం కొత్త దారుల‌ను వెతికేలా మార్గాలు చూపిస్తుంద‌ని చెప్పారు. జీవితంలో ఎద‌గాలంటే చ‌దువు అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. మీరు ఎద‌గాలి ఇత‌రుల‌ను కూడా ఎదిగేందుకు ఆస‌రా కావాల‌ని పిలుపునిచ్చారు.

ఒక దీపం మ‌రో దిపాన్ని వెలిగిస్తుంది. మీరు కూడా నైతిక విలువ‌ల్ని పాటిస్తూ ముందుకు సాగాల‌ని కోరారు కైలాష్ స‌త్యార్థి(Kailash Satyarthi) . నాకే కాదు మీకు కూడా నోబెల్ బ‌హుమ‌తి వ‌స్తుంద‌న్నారు. కానీ స‌మున్న‌త ల‌క్ష్యం దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయాల‌ని సూచించారు. కృషి చేస్తే సాధించిన‌ది ఏదీ లేదు ఈ లోకంలో అని చెప్పారు.

క‌ష్ట ప‌డితేనే మ‌నం క‌నే క‌ల‌లు నిజం అవుతాయ‌ని అందుకు త‌గిన ప్లాన్ కూడా ఉండాల‌న్నారు. ఎదుగు బొదుగు లేని జీవితం చివ‌ర‌కు ఇబ్బందులకు గురి చేస్తుంద‌ని హెచ్చ‌రించారు. టెక్నాల‌జీ పెరుగుతోందని, దానిని జాగ్ర‌త్త‌గా చ‌దువు కోసం మాత్ర‌మే వినియోగించాల‌ని స్ప‌ష్టం చేశారు కైలాష్ స‌త్యార్థి.

కులం, మ‌తం, ప్రాంతాల‌న్న‌వి మ‌నం సృష్టించుకున్న‌వేన‌ని కానీ ఇవేవీ చ‌దువు కునేందుకు అడ్డంకులు కాకూడ‌ద‌న్నారు. మ‌త సామ‌ర‌స్య‌త కోసం ప్ర‌తి ఒక్క‌రం పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చారు. బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించేందుకు ప్ర‌తి ఒక్క‌రం న‌డుం బిగించాల‌ని కోరారు.

Also Read : రైత‌న్న‌ల‌కు కేసీఆర్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!