Team India : భారత, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ కేప్ టౌన్ లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
తీవ్ర గాయాలు భారత ఆటగాళ్లను వెంటాడుతున్నాయి. టీ20, వన్డే జట్లకు స్కిప్పర్ గా రోహిత్ శర్మకు(Team India) అప్పగించింది బీసీసీఐ. ఇదే సమయంలో భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ కు చాన్స్ ఇచ్చింది.
ఈ తరుణంలో కేవలం టెస్టు స్కిప్పర్ గా కోహ్లీని ఉంచింది. త్వరలో అది కూడా ఉంటుందో ఉండదోనన్న అనుమానం అభిమానుల్లో కలుగుతోంది.
మరో వైపు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపికపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి విరాట్ కోహ్లీ సైతం బాంబు పేల్చాడు. తనకు గంట ముందు మాత్రమే చెప్పారంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
సఫారీ టూర్ ఉండడంతో బీసీసీఐ ఏమీ అనలేదు. కానీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ , మాజీ భారత క్రికెట్ జట్టు పేసర్ చేతన్ శర్మ కీలక కామెంట్స్ చేశాడు. తాము ఈ విషయాన్ని కోహ్లీకి(Team India) చెప్పామని కానీ ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనంటూ స్పష్టం చేశాడు.
ఇదే సమయంలో సఫారీ టూర్ ఉండడంతో వేచి చూసి ధోరణి అవలంభిస్తోంది. ఈ తరుణంలో మూడు టెస్టుల సీరీస్ లో భాగంగా జరిగిన టెస్టుల్లో భారత్ , సఫారీ జట్లు చెరోటి గెలిచాయి.
మూడో టెస్టుకు తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కెప్టెన్ కోహ్లీ,
చతేశ్వర్ పుజారా, రిషబ్ పంథ్, అజింక్యా రహానే, విహారిలలో ఎవరు ఉంటారనేది అనుమానంగా ఉంది. స్కిప్పర్ కావడంతో కోహ్లీ ఓకే. కానీ మిగతా వారి పరిస్థితి ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : కెప్టెన్ కానున్న హార్దిక్ పాండ్యా