Punjab Elections : పంజాబ్ లో టార్చ్ బేర‌ర్ ఎవ‌రో

అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఉత్కంఠ

Punjab Elections : అంద‌రి చూపు పంజాబ్ పై ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేసింది.

ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఉంది.

ప్ర‌ధానంగా ఇక్క‌డ అకాళీద‌ళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్ )  బ‌రిలో ఉన్నాయి.

రాష్ట్రంలో 117 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. బీజేపీ, పీఎల్సీ పార్టీలు కూట‌మిగా పోటీ చేస్తున్నాయి.

65 సీట్ల‌లో బీజేపీ అభ్య‌ర్థులు పోటీ చేస్తుండ‌గా 37 సీట్ల‌లో పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ప్ర‌ధానంగా కాంగ్రెస్ వ‌ర్సెస్ ఆప్ పార్టీల మ‌ధ్య పోటీ నెల‌కొంది. చాలా చోట్ల నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది.

పంజాబ్ రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న, సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ఉన్న‌ట్టుండి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

పీసీసీ చీఫ్ సిద్దూ తో ప‌డ‌క తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు అమ‌రీంద‌ర్ సింగ్. దీనిని కొట్టి పారేశారు సిద్దూ. ఇక పంజాబ్ రాష్ట్రంలో అత్య‌ధికంగా ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఉంది.

దీంతో కాంగ్రెస్ హైక‌మాండ్ అదే సామాజిక వ‌ర్గానికి చెందిన చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

ఇక పంజాబ్ లో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందంటూ ఆప్ ఆరోపిస్తోంది. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ముందుకు సాగుతోంది. ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పంజాబ్ పై ఫోక‌స్ పెట్టారు.

ఇప్ప‌టికే త‌మ పార్టీ త‌ర‌పున భ‌గ‌వంత్ మాన్ ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఇక పంజాబ్ మోడ‌ల్ పేరుతో పీసీసీ చీఫ్ సిద్దూ స్టార్ ఎన్నిక‌ల  క్యాంపెయిన‌ర్ గా దూసుకు పోతున్నారు.

అకాళీద‌ళ్, బీజేపీ, పీఎల్సీ పార్టీలు సైతం అత్య‌ధిక ప్ర‌భావం చూప‌నున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రు టార్చ్ బేర‌ర్ అవుతార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Also Read: ‘కిన్నెర’ వాయిద్యం ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!