Sonali Phogat Letters : డీల్ కుదుర్చు కోవాలంటూ లేఖ‌లు

సోనాలీ ఫోగ‌ట్ కుటుంబీకుల ఆరోప‌ణ

Sonali Phogat Letters : ప్ర‌ముఖ న‌టి, భార‌తీయ జ‌న‌తా పార్టీ హ‌ర్యానాకు చెందిన నాయ‌కురాలు సోనాలీ ఫోగ‌ట్ గోవాలో అత్యాచారం, దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఆమె హ‌త్య దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. విచిత్రం ఏమిటంటే ఆమె స్వ‌స్థలం బీజేపీ పాలిస్తున్న హ‌ర్యానాకు చెందింది.

అంతే కాకుండా ఆమె హ‌త్య‌కు గురైంది బీజేపీ నేతృత్వంలోని గోవా రాష్ట్రం. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు దోషులు అనేది తేల‌లేదు. విచార‌ణ‌పై తాత్సారం చేస్తున్నారంటూ సోనాలీ ఫోగ‌ట్ కుటుంబీకులు ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టలేదు.

తాజాగా సంచ‌ల‌న అంశం వెలుగు చూసింది. అదేమిటంటే మృతురాలు సోనాలీ ఫోగ‌ట్ (Sonali Phogat)  కుటుంబానికి గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి రెండు లేఖ‌లు అందాయి. వాటిలో ఒక దానిలో రూ. 10 కోట్లు చెల్లిస్తామ‌ని, డీల్ కుదుర్చుకుందాంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఇది క‌ల‌క‌లం రేపింది. తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.

ఇదిలా ఉండ‌గా ఈ డీల్ లేఖ పై స్పందించారు సోనాలీ ఫోగ‌ట్ బావ అమ‌న్ పూనియా. కేసుకు సంబంధించి ముఖ్య‌మైన స‌మాచారాన్ని క‌లిగి ఉన్నందు వ‌ల్ల త‌మ ఫ్యామిలీకి అందిన ఆ రెండు లేఖ‌ల‌పై దర్యాప్తు చేప‌ట్టాలంటూ డిమాండ్ చేశారు.

అయితే సోనాలీ సోద‌రి రుకేష్ ఆంద‌పూర్ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని పూనియా తెలిపారు. అజ్ఞాత వ్య‌క్తి నుంచి రెండు లేఖ‌లు అందాయ‌ని తెలిపారు పూనియా. ఎవ‌రు రాశారు, ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌నేది తేల్చాల్సింది తాము కాద‌ని పోలీసుల‌ని పేర్కొన్నారు.

Also Read : డిప్రెష‌న్ అన్న‌ది క‌నిపించ‌ని రోగం – దీపికా

Leave A Reply

Your Email Id will not be published!