Sonam Wangchuk Modi : మోడీజీ లడ‌ఖ్ ను ర‌క్షించండి

అంత‌రించి పోతున్న హిమ‌నీన‌దాలు

Sonam Wangchuk Modi : త్రీ ఇడియ‌ట్స్ సినిమాకు ప్రేర‌ణ‌గా నిలిచిన సామాజిక సంస్క‌ర‌ణ‌వాది సోన‌మ్ వాంగ్ చుక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ల‌డ‌ఖ్ లో ప్ర‌స్తుతం ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాగే అజాగ్ర‌త్త కొన‌సాగితే, ప‌రిశ్ర‌మ‌ల నుండి ఈ ప్రాంతానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌క పోతే ఇక్క‌డ ఉన్న హిమ‌నీన‌దాలు అంత‌రించి పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

ఈ మేర‌కు సోన‌మ్ వాంగ్ చుక్ దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీకి విన్న‌వించారు. ఇప్ప‌టికైనా స‌మ‌యం మించి పోలేద‌ని యుద్ద ప్రాతిప‌దిక‌న ల‌డ‌ఖ్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు సోన‌మ్ వాంగ్ చుక్(Sonam Wangchuk).

ల‌డ‌ఖ్ త‌న స‌హ‌జ సిద్ద‌మైన వాతావ‌ర‌ణాన్ని కోల్పోకుండా ఉండేందుకు త‌గినంత భ‌ద్ర‌త‌, స‌హ‌కారం ఉండేలా చూడాల‌ని కోరారు. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇక్క‌డ అపార‌మైన హిమ‌నీన‌దాలు ఉన్నాయ‌ని, కొలువు తీరిన ప‌రిశ్ర‌మ‌ల నుండి ర‌క్ష‌ణ క‌ల్పించ‌క పోతే అవి అంత‌రించి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

అదే స‌మ‌యంలో నీటి కొర‌త ఏర్ప‌డుతుంద‌ని, అపార‌మైన స‌మ‌స్య‌లు నెల‌కొంటాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు సోన‌మ్ వాంగ్ చుక్. ఇటీవ‌ల ల‌డ‌ఖ్ ను సంద‌ర్శించిన కాశ్మీర్ విశ్వ విద్యాల‌యం ప‌రిశోధ‌కులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించార‌ని తెలిపారు.

ఇప్ప‌టికే హిమ‌నీన‌దాలు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని పేర్కొన్నార‌ని ఇక‌నైనా మోడీ దీనిని సీరియ‌స్ గా గుర్తించి వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సోన‌మ్ వాంగ్ చుక్(Sonam Wangchuk) విన్న‌వించారు.

అమెరికా, యూర‌ప్ కార‌ణంగా మాత్ర‌మే గ్లోబ‌ల్ వార్మింగ్ ఈ వాతావ‌ర‌ణం మార్పున‌కు కార‌ణం కాద‌న్నారు. స్థానిక కాలుష్యం, ఉద్ఘారాలు దీనికి స‌మాన బాధ్య‌త వ‌హిస్తాయ‌ని వాంగ్ చుక్ హెచ్చ‌రించారు.

Also Read : నేతాజీని చూసి ఆంగ్లేయులు భ‌య‌ప‌డ్డారు

Leave A Reply

Your Email Id will not be published!