Sonia Gandhi Comment : కాంగ్రెస్ లో కీల‌కం సోనియా సుప్రీం

పార్టీ ప‌రంగా ఆమెదైన ముద్ర

Sonia Gandhi Comment : మ‌రోసారి సోనియా గాంధీ హాట్ టాపిక్ గా మారారు. ఎక్క‌డా వివాదాల‌కు తావు లేని వ్య‌క్తిత్వం ఆమెది. సౌమ్యంగా ఉంటూనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తూ వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో పార్టీలోనే ఉంటూ ఇబ్బందుల‌కు గురి చేసిన వాళ్ల‌ను ఉపేక్షించిన దాఖాలు లేవు. కానీ ఎవ‌రైనా ఎక్కువ‌గా ట‌చ్ లో ఉండాల‌ని కోరుకునే నేత‌ల‌లో ప్ర‌ధానంగా ప్ర‌యారిటీ ఇచ్చేది మాత్రం ఏకైక నాయ‌కురాలు సోనియా గాంధీ(Sonia Gandhi).

పార్టీ ప‌గ్గాలు తీసుకున్నా, ఆ త‌ర్వాత దానిని వ‌దులుకున్నా ఎక్క‌డా త‌ప్ప‌ట‌డుగులు వేసింది లేదు. ప్ర‌తి నిర్ణ‌యం ఆచి తూచి తీసుకోవ‌డంలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తూ వ‌స్తున్నారు. ఆ మ‌ధ్య లోక్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపినా ఆ త‌ర్వాత ఎక్క‌డా త‌గ్గ‌లేదు. నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రికకు సంబంధించి మ‌నీ లాండ‌రింగ్ కేసు సంద‌ర్బంగా స్వ‌యంగా తాను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ ముందు హాజ‌ర‌య్యారు. ఎక్క‌డా కార‌ణాలు వెతుక్కోలేదు. ఆపై లాయ‌ర్ల‌ను సంప్ర‌దించ‌లేదు. చాలా సాధార‌ణంగా త‌నతో పాటు త‌న‌యుడు రాహుల్ గాంధీ కూడా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా ఎవ‌రూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ వ‌ద్ద‌ని, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్ట వ‌ద్దంటూ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు(Sonia Gandhi). ఓ వైపు మోదీ దాడుల‌కు దిగుతున్నా, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసినా ప‌ల్లెత్తు మాట అన‌లేదు సోనియా గాంధీ. త‌ను ప్రేమించిన భ‌ర్తను పోగొట్టుకుంది. త‌న‌కు అండ‌గా ఉంటుంద‌ని అనుకున్న అత్త తుపాకీ గుళ్ల‌కు బ‌లై పోయింది. ఈ స‌మ‌యంలో మ‌రొక‌రైతే కుప్ప కూలి పోతారు. కానీ ఎక్క‌డా భావోద్వేగాల‌ను క‌నిపించ నీయ‌లేదు. ఇది సోనియా గాంధీకి ఉన్న ప్ర‌త్యేక‌త‌.

2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ఓట‌మిని చ‌వి చూసినా , త‌న‌యుడు పార్టీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నా ఎక్క‌డా త‌ల వంచ లేదు. తానే ముందుండి న‌డిపించింది. సీనియ‌ర్లు వెళ్లి పోతున్నా , అయిన వారు లోలోప‌ట విమ‌ర్శ‌లు చేసినా ఎవ‌రి గురించి బ‌హిరంగంగా విమ‌ర్శ‌ల‌కు దిగ‌లేదు. ఇలాంటి సానుకూల దృక్ప‌థం, వాతావ‌ర‌ణం పార్టీకి ఒక బ‌లంగా మారింది. భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా ఆమె ప్ర‌త్యేకంగా క‌ర్ణాట‌క‌కు వెళ్లారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. వారితో ముచ్చ‌టించారు. తాను తీవ్ర‌మైన అనారోగ్యానికి గురైనా స‌రే వెనుదిర‌గ‌లేదు.

గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకానొక ద‌శ‌లో పార్టీ ఐసీయూలోకి వెళ్లి పోయింది. కానీ మెల మెల్ల‌గా త‌న‌యుడు చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర పార్టీకి జీవం పోసింది. తిరిగి నిల‌బెట్టేలా చేసింది. ఇంకా స‌మ‌స్య‌లు లేవ‌ని కాదు. కానీ పూర్తి పాజిటివ్ ధోర‌ణితో ముందుకు సాగుతున్న సోనియా గాంధీ ఇప్పుడు కీల‌కంగా మారారన‌డంలో సందేహం లేదు. ఇదే స‌మ‌యంలో ఇవాళ చోటు చేసుకున్న క‌ర్ణాట‌క సీఎం వ్య‌వ‌హారానికి సోనియా గాంధీనే పుల్ స్టాప్ పెట్టారు(Sonia Gandhi). సిద్దూ , డీకే మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. మొత్తంగా కాంగ్రెస్ లో కీల‌కం సోనియానే సుప్రీం అని చెప్పక త‌ప్ప‌దు.

Also Read : Nitish Kumar

 

Leave A Reply

Your Email Id will not be published!