Sonia Gandhi : తెలంగాణ ఆత్మ గీతం గద్దర్ – సోనియా
ప్రజా యుద్ద నౌక మరణం బాధాకరం
Sonia Gandhi : సీపీపీ చైర్ పర్సన్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ మరణం పట్ల ఆమె సంతాపం తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య విమలకు లేఖ రాశారు. గద్దర్ తెలంగాణకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని ఆయన దేశానికి చెందిన కళాకారుడు అని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చ లేనిదని ఆవేదన చెందారు సోనియా గాంధీ.
Sonia Gandhi Tributes to Gaddar
ఈ సందర్భంగా ఆయన భార్య విమలకు, కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు. గద్దర్ వ్యక్తి కాదు ఓ శక్తి. అద్భుతమైన గాయకుడు, కవి, రచయిత. ఇన్నేళ్లుగా కేవలం ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం గొంతుగా మారడం మామూలు విషయం కాదని కొనియాడారు సోనియా గాంధీ(Sonia Gandhi). తన జీవత కాలమంతా పేదల పక్షాన నిలబడ్డారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు .
తన ఆట, పాటలతో కోట్లాది మందిని ప్రభావితం చేయడం మామూలు విషయం కాదు. అది ప్రజల పట్ల ప్రేమ ఉంటేనే జరుగుతుందన్నారు. ఎంతో ప్రతిభావంతమైన కళాకారుడైన గద్దర్ ను కోల్పోవడం బాధాను కలిగిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను బాధకు లోనవుతున్నానని తెలిపారు సోనియా గాంధీ.
Also Read : Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మన్ సేవలు భేష్