Kottara Kottu Teenmaaru : భోళా శంక‌ర్ ‘కొట్టరా కొట్టు’ సూప‌ర్

యూట్యూబ్ లో సాంగ్ హ‌ల్ చ‌ల్

Kottara Kottu Teenmaaru : మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ రిలీజ్ కాకుండానే దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్ , సాంగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ను తెగ ముద్దు వ‌చ్చేలా చేశాయి. ఇక మాస్ మేన‌రిజాన్ని మ‌రింత ఎలివేట్ చేసేలా ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు.

Kottara Kottu Teenmaaru Song Viral

ఇక జాన‌ప‌ద గీతాల‌కు పెట్టింది పేరు అయిన కాస‌ర్ల శ్యాం క‌లం లోంచి మ‌రో పాట వ‌చ్చింది. అదే భోళా శంక‌ర్ లోని కొట్ట‌రా కొట్టు తీన్మారు(Kottara Kottu Teenmaaru) సాంగ్. ఆస్కార్ అవార్డు సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట‌ను పాడారు. ఇక ఎప్ప‌టి లాగే క‌ళ్లు చెదిరేలా డ్యాన్సుల‌తో ఇర‌గ దీశాడు మెగాస్టార్ చిరంజీవి. యువ న‌టుల‌కు ధీటుగా ఇందులో న‌టించి ఔరా అనిపించేలా చేశాడు.

ఈ కొట్ట‌రా కొట్టు తీన్మారు సాంగ్ కు సంగీతాన్ని అందించారు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్. ఇక చిత్రం భోలా శంక‌ర్ విష‌యానికి వ‌స్తే ఇందులో చిరంజీవితో పాటు త‌మ‌న్నా భాటియా, కీర్తి సురేష్ , సుశాంత్ , త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్ , శ్రీ‌ముఖి, ముర‌ళీ శ‌ర్మ‌, గెట‌ప్ శ్రీ‌ను, షావ‌ర్ అలీ, సితార‌, కాశీ విశ్వ‌నాథ్ , హైప‌ర్ ఆది, వైవా హ‌ర్ష‌, బ్ర‌హ్మాజీ, ఉత్తేజ్ , స‌త్య‌, తాగుబోతు ర‌మేష్, వేణు, బిత్తిరి సత్తి న‌టించారు. మొత్తంగా ఈ సాంగ్ ను ల‌క్ష‌లాది మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు.

Also Read : Sonia Gandhi : తెలంగాణ ఆత్మ గీతం గ‌ద్ద‌ర్ – సోనియా

Leave A Reply

Your Email Id will not be published!