Sonia Gandhi Jodo Yatra : భార‌త్ జోడో యాత్రలో సోనియా గాంధీ

క‌ర్ణాట‌క‌లోని మాండ్యా జిల్లాలో యాత్ర

Sonia Gandhi Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర త‌మిళ‌నాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభ‌మై కేర‌ళ‌లో ముగిసి క‌ర్ణాట‌క‌లోకి ప్ర‌వేశించింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ.

యువ నాయ‌కుడికి అపూర్వ‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. రాహుల్ గాంధీ వెంట క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ హాజ‌ర‌య్యారు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌ర్ణాట‌క‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబ‌ర్ 30న చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లా గుండ్లుపేట మీదుగా క‌ర్ణాట‌క‌లో అడుగు పెట్టింది.

అక్క‌డి నుంచి మైసూరు చేరుకుంది. గురువారం సోనియా గాంధీ(Sonia Gandhi Jodo Yatra) మాండ్యా జిల్లాలో కొన‌సాగుతున్న భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు. మేడంతో పాటు ఇత‌ర పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఒక రోజు కిందట సోనియా గాంధీ విజయ ద‌శ‌మి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని బేగూరు గ్రామంలోని భీమ‌న‌కొల్లి ఆల‌యాన్ని ద‌ర్శించుకుని పూజ‌లు చేశారు.

క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ సోనియా గాంధీకి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. సోనియా రాష్ట్రానికి రావ‌డం వ‌చ్చినందుకు గ‌ర్విస్తున్న‌ట్లు తెలిపారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. సోనియా, రాహుల్ గాంధీని చూసేందుకు జ‌నం పెద్ద ఎత్తున హాజ‌రయ్యారు. మేడం, రాహుల్ క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు.

Also Read : కేసీఆర్ క‌లలు గులాబీ రెప‌రెప‌లు

Leave A Reply

Your Email Id will not be published!