Indira Gandhi : ‘ఇందిర’ దేశం మరువని ధీర వనిత
ఇవాళ మాజీ ప్రధానికి ఘన నివాళులు
Indira Gandhi : భారత దేశంలో ఉక్కు మహిళగా , నాయకురాలిగా పేరొందిన మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా గాంధీ వర్దంతి. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ప్రముఖ నాయకులు నివాళులు అర్పించారు. ఆమె నాయకత్వ స్పూర్తిని గుర్తు చేసుకున్నారు.
ఈ దేశం గర్వించ దగిన నాయకురాలలో ఇందిరా గాంధీ ఒకరని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ విముక్తి నుండి హరిత విప్లవానికి నాంది పలికే వరకు, దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత ఆమెదేనని కొనియాడారు. ట్విట్టర్ వేదికగా ఇందిరా గాంధీకి(Indira Gandhi) నివాళులతో హోరెత్తింది.
సరిగ్గా ఇదే రోజు ఇందిరా గాంధీని న్యూ ఢిల్లి లోని ఆమె నివాసంలో ఇద్దరు అంగరక్షకులు కాల్చి చంపారు. ఆమె వర్దంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఇతర నేతలు సోమవారం ఢిల్లీ లోని శక్తి స్తల్ స్మారక చిహ్నం వద్ద ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు.
ప్రతి ఏడాది అక్టోబర్ 31న వర్దంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం భారత ఉక్కు మహిళ 38వ వర్ధంతి. పటిష్టవంతమైన నాయకత్వానికి, నిబద్దతకు, దూర దృష్టికి..పట్టుదల వీడని మహిళా నాయకురాలిగా ఎప్పటికీ ఈ దేశ చరిత్రలో నిలిచి పోతారని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ.
తన అధికారిక ట్విట్టర్ లో ఇందిరా గాంధీని గుర్తు చేసుకున్నారు. నేను ఈరోజు చని పోతే నా ప్రతి రక్తపు బొట్టు దేశాన్ని ఉత్తేజ పరుస్తుందన్న మాటలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్.
Also Read : రాహుల్ యాత్ర సూపర్ – శత్రుఘ్న సిన్హా