IPL Media Rights : ఐపీఎల్ రైట్స్ ద‌క్కించుకున్న సోనీ..జియో

డీల్ వాల్యూ రూ. 44,075 వేల కోట్లు

IPL Media Rights : భార‌త దేశ క్రీడా చ‌రిత్ర‌లో బీసీసీఐ అరుదైన చ‌రిత్ర‌ను సృష్టించింది. ప్ర‌పంచంలోనే టాప్ లీగ్ ల‌లో ఒక‌టిగా పేరొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) కు సంబంధించి ఐదేళ్ల కాలానికి 2023 – 2027 వ‌ర‌కు డిజిట‌ల్, టీవీ ప్ర‌సార హ‌క్కుల కోసం రెండు రోజుల పాటు వేలం పాట చేప‌ట్టింది.

ముందుగానే బీసీసీఐ ఊహించిన‌ట్లుగానే భారీ ఆదాయం స‌మ‌కూరింది. మొత్తం డీల్ విలువ రూ. 44, 075 కోట్ల‌కు కుదిరిన‌ట్లు స‌మాచారం. ఐదేళ్ల కాల వ్య‌వ‌ధిలో మొత్తం 410 మ్యాచ్ ల కోసం డీల్ కుదిరింది.

టీవీ హ‌క్కులను రూ. 23, 575 కోట్ల‌కు విక్ర‌యించగా డిజిట‌ల్ హ‌క్కులు రూ. 20, 500 కోట్ల‌కు చేరాయి. దేశ , విదేశాల‌కు చెందిన కంపెనీలు ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల(IPL Media Rights) కోసం పోటీ ప‌డ్డాయ‌యి.

తీవ్ర‌మైన బిడ్డింగ్ త‌ర్వాత టీవీ, డిజిట‌ల్ హ‌క్కుల్ని ఇద్ద‌రు ప్ర‌సార క‌ర్త‌లు విడివిడిగా గెలుచుకున్న‌ట్లు తెలిసింది. మీడియా హ‌క్కుల్ని సోనీ చేజిక్కించుకోగా డిజిట‌ల్ హ‌క్కుల్ని రిల‌య‌న్స్ కంపెనీకి చెందిన జియో ద‌క్కించుకుంది.

ప్యాకేజీ ఎ ( టీవీ హ‌క్కులు ) , బి ( డిజిట‌ల్ హ‌క్కులు ) ధ‌ర‌లు రూ. 44,075 కోట్లుగా నిర్ణ‌యించ‌బ‌డ్డాయి. దీని ప్ర‌కారం ఐపీఎల్ మ్యాచ్ విలువ రూ. 100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చ‌వుతుంది.

ఇది భార‌తీయ క్రీడా చ‌రిత్ర‌లో క‌నివిని ఎరుగ‌ని విష‌యం. ఇక క్రికెట్ వ‌ర్గాల ప్ర‌కారం ప్ర‌స్తుతం ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ ధ‌ర ఏకంగా రూ. 107.5 కోట్లు ప‌లుకుతోంది.

ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 2017లో రూ. 16,347.50 కోట్ల బిడ్ తో 2017-2022 స్టార్ చేజిక్కించుకుంది. ఈ డీల్ తో దాదాపు మ్యాచ్ ధ‌ర రూ. 55 కోట్ల‌కు చేరుకుంది.

Also Read : రూ. 43,050 కోట్లు దాటిన ఐపీఎల్ వేలం

Leave A Reply

Your Email Id will not be published!