Soumya Swaminathan : సౌమ్య స్వామినాథ‌న్ రాజీనామా

చీఫ్ సైంటిస్ట్ ప‌ద‌వికి రాం రాం

Soumya Swaminathan : ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ విశిష్ట సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ రాజీనామా చేశారు. త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పారు. ఈ ప‌ద‌వికి విప‌రీత‌మైన ప్రాధాన్య‌త ఉంది. అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో సైతం విశిష్ట సేవ‌లు అంద‌జేశారు.

ఆమె ప‌ద‌వీ కాలం రెండు సంవ‌త్స‌రాలు ఉండ‌గానే త‌ప్పుకున్నారు సౌమ్యా స్వామినాథ‌న్(Soumya Swaminathan). భార‌త దేశంలో ప్ర‌జారోగ్య సేవ‌లు అంద‌జేసేందుకు గాను తాను ఈ క్లిష్ట‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు. రాజీనామా చేసిన అనంత‌రం సౌమ్యా స్వామినాథ‌న్ మీడియాతో మాట్లాడారు.

ఆమె ఎవ‌రో కాదు. దేశానికి విశిష్ట సేవ‌లు అందించిన డాక్ట‌ర్ ఎమ్మెస్ స్వామి నాథ‌న్ కు స్వ‌యాన కూతురు. దేశం ప‌ట్ల , అట్ట‌డుగున ఉన్న వ‌ర్గాల ప‌ట్ల అచంచ‌ల‌మైన ప్రేమ క‌లిగి ఉన్నారు సౌమ్యా స్వామినాథన్. స్వామి నాథ‌న్ దేశంలో వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క‌మైన మార్పుల‌కు, అభివృద్దికి విశిష్ట సేవ‌లు, ప‌రిశోధ‌న‌లు, స‌హ‌కారం అందించారు.

ఇక ఆరోగ్య ప‌రంగా సౌమ్యా స్వామినాథ‌న్ ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం ఎన‌లేని కృషి చేశారు. ఆమె మెడిసిన్ చ‌దివారు. చిన్న పిల్ల‌ల‌కు సంబంధించిన వైద్యంలో ఎండీ చేశారు. పిల్ల‌ల్లో టీబీ, చికిత్స‌పై రీసెర్చ్ చేశారు. ఎయిడ్స్ పై కూడా ప‌రిశోధ‌న చేశారు.

నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్యూబ‌ర్ క్యులోసిస్ కు డైరెక్ట‌ర్ గా , ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్ గా విధులు నిర్వ‌హించారు.

Also Read : విద్యార్థినుల‌కు శానిట‌రీ న్యాప్కిన్లు

Leave A Reply

Your Email Id will not be published!