Sourav Ganguly : కోల్డ్ ఫుడ్ పై గంగూలీ కామెంట్స్

ఐసీసీకి టీమిండియా ఫిర్యాదు

Sourav Ganguly : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. త‌మ‌కు కోల్డ్ ఫుడ్ అందించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది భార‌త జ‌ట్టు. దానిని తిర‌స్క‌రించింది. ప్రాక్టీస్ చేసిన అనంత‌రం తిన‌కుండానే హోట‌ల్ కు వెళ్లి భోజ‌నం చేసింది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించింది టీమ్ మేనేజ్ మెంట్. దేశ వ్యాప్తంగా కోల్డ్ ఫుడ్ వ్య‌వ‌హారంపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ చీఫ్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly) స్పందించాడు. సాధ్య‌మైనంత మేర‌కు స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగేలా బీసీసీఐ పాల‌క‌వ‌ర్గం ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

అయితే బీసీసీఐ అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయ‌న‌ప్ప‌టికీ ఎస్సీజీ లో ఆఫ‌ర్ లో ఉన్న ఆహారానికి సంబంధించి ప్ర‌స్తావించార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా బీసీసీఐ కొత్త బాస్ గా కొలువు తీరిన‌ 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌భ్యుడైన రోజ‌ర్ బిన్నీస్పందించారు. ఇవాళ జ‌రిగే సూప‌ర్ 12 మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌డంతో ప్రాక్టీస్ లో నిమ‌గ్న‌మైన టీమిండియా కొంత ఇబ్బందికి గురైన మాట వాస్త‌వ‌మేన‌ని ఒప్పుకున్నారు.

ఈ విష‌యం గురించి ఆరా తీస్తామ‌ని , అక్క‌డం ఏం జ‌రిగింద‌నే దానిపై తెలుసుకుని వివ‌ర‌ణ కోరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఐసీసీ త‌న టోర్నీ సంద‌ర్భంగా అంద‌రికీ ఒకే ర‌క‌మైన ఫుడ్ ను స‌ర్వ్ చేస్తుంది. ప్ర‌స్తుతం కోల్డ్ ఫుడ్ టీమిండియా వ్య‌వ‌హారం మ‌రో చ‌ర్చ‌కు దారి తీసింది.

కాగా ఎక్కువ మంది క్రికెట‌ర్లు మ‌ధ్యాహ్న భోజ‌నం మానేశారు. త‌మ‌కు న‌చ్చిన భోజ‌నం కోసం హోట‌ల్ గ‌దికి తిరిగి వెళ్ల‌డం ప‌ట్ల బీసీసీఐ ఎందుకు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే దానిపై ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు.

Also Read : ప‌సికూన‌పై ప్ర‌తాపం చూపిస్తారా

Leave A Reply

Your Email Id will not be published!