Sourav Ganguly Gibs : వ‌ర‌ల్డ్ లెజెండ్స్ నుంచి గిబ్స్ ఔట్

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న దాదా

Sourav Ganguly Gibs : బీసీసీఐ రూల్స్ కు విరుద్దంగా గిబ్స్ వ్య‌వ‌హ‌రించాడు. ఆపై వ‌ద్ద‌న్నా విన‌కుండా పాక్ ఆక్ర‌మిక కాశ్మీర్ లో కాశ్మీర్ టి20 లీగ్ లో పాల్గొన్నాడు.

తాజాగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా భార‌త్ లెజెండ్స్ వ‌ర‌ల్డ్ లెజెండ్స్ జ‌ట్ల మ‌ధ్య చారిటీ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతానికి బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ భార‌త లెజెండ్స్ కు సార‌థ్యం వ‌హిస్తున్నాడు.

ఇక వ‌ర‌ల్డ్ లెజెండ్స్ జ‌ట్టులో గిబ్స్ ను ఎంపిక చేయ‌డంపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీంతో ఎట్ట‌కేల‌కు త‌ప్పు జ‌రిగింద‌ని తెలుసుకున్నాడు బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly Gibs) .

వెంట‌నే రంగంలోకి దిగాడు. గిబ్స్ ను వ‌ర‌ల్డ్ లెజెండ్స్ నుంచి త‌ప్పించాడు. ఆపై గిబ్స్ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట‌ర్ షేన్ వాట్స‌న్ ను ఎంపిక చేశాడు.

దీంతో గ‌త కొన్ని రోజులుగా సౌర‌వ్ గంగూలీపై నిప్పులు చెరుగుతూ వ‌చ్చిన నెటిజ‌న్లు, క్రికెట్ ఫ్యాన్స్ కొంత శాంతించారు. ఇక భార‌త లెజెండ్స్ జ‌ట్టులో ఇప్ప‌టి దాకా దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన ప్ర‌ముఖ క్రికెటర్లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

ఇక వ‌ర‌ల్డ్ లెజెండ్స్ జ‌ట్టు త‌ర‌పున ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన క్రికెట‌ర్లు ఆడుతున్నారు. ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతున్నాయి.

దేశానికి స్వతంత్రం వ‌చ్చి 75 ఏళ్ల‌వుతోంది. వ‌జ్రోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని బీసీసీఐ ఈ మ్యాచ్ ల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఈ చారిటీ మ్యాచ్ ల ద్వారా కేంద్రానికి కొంత మొత్తం అందించాల‌న్న‌ది ప్లాన్.

Also Read : సూర్య‌’కు నాలుగో స్థాన‌మే బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!