Sourav Ganguly : రోహిత్..కోహ్లీ ఫామ్ పై దాదా కామెంట్

పేల‌వ‌మైన ఆట తీరుతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌

Sourav Ganguly  : ఒక భార‌త జ‌ట్టుకు కెప్టెన్ . మరొక‌రు ఆ జ‌ట్టుకు మాజీ కెప్టెన్ . కానీ వారిద్ద‌రి ప‌రిస్థితి దారుణంగా ఉంది. వాళ్ల‌వెరో కాదు తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతున్న రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ.

ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ వ‌రుస‌గా ఎనిమిది మ్యాచ్ లు ఓడి పోయాడు. జ‌ట్టును ముందుండి న‌డిపించాల్సిన హిట్ మ్యాన్ నుంచి ప‌రుగులే రావ‌డం గ‌గ‌నంగా మారింది.

ఇక విరాట్ కోహ్లీ గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఐపీఎల్ 2022లో మ‌నోడు చేసిన ప‌రుగులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టుమ‌ని వంద ప‌రుగుల‌కు కొంచెం ఎక్కువ చేశాడు. రెండు సార్లు డ‌కౌట్ అయ్యాడు.

ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక పోతున్నాడు. అస‌లు ఆనాటి కోహ్లీనేనా మ‌నం చూస్తున్న‌ది అని క్రీడాభిమానులు వాపోతున్నారు. గ‌త రెండేళ్ల నుంచి కోహ్లీ టోట‌ల్ గా ఆట‌పై ప‌ట్టు కోల్పోయాడు.

ఎక్క‌డా ప‌టుత్వం, క‌సి క‌నిపించ‌డం లేదు. ఆడామా వెళ్లామా అన్న రీతిలో సాగుతోంది కోహ్లీ ఆట తీరు. ఈ త‌రుణంలో భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి చైర్మ‌న్ , సిఇఓ సౌర‌వ్ గంగూలీ (Sourav Ganguly)సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ పేల‌వ‌మైన ఫామ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐపీఎల్ లో పూర్తిగా నిరాశ ప‌రిచార‌ని, వారు తిరిగి పుంజుకుని ఆడాలంటే క‌ష్ట ప‌డాల‌ని సూచించాడు.

బ్యాటింగ్ టెక్నిక్ ఒక్కోసారి మారుతుంద‌ని, దానిన కాస్తా పెంచు కోగ‌లితే రాణించ వ‌చ్చ‌ని తెలిపాడు. అయితే రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. వారిద్ద‌రూ త‌ప్ప‌క రాణిస్తార‌ని చెప్పాడు.

Also Read : పీసీబీలో ప్రాధాన్య‌త‌లు మారాలి – మిస్బా

Leave A Reply

Your Email Id will not be published!