Sourav Ganguly : ‘దాదా’ క‌ల‌కాలం ఇలాగే వ‌ర్దిళ్లు

సౌర‌వ్ గంగూలీ పుట్టిన రోజు

Sourav Ganguly : భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన సౌర‌వ్ గంగూలీది ఒక చ‌రిత్ర‌. బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ కు ప్రెసిడెంట్ గా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ దాల్మియా కూడా ఇక్క‌డి వాడే.

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ)కి ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తీసుకువ‌చ్చిన వారిలో దాల్మియా ఒక‌డు. అంత‌కు ముందు రాజ్ సింగ్ దుర్గాపూర్ , ల‌లిత్ మోదీ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఇద్ద‌రు లేరు. మోదీ ఒక‌డే బ‌తికి ఉన్నాడు.

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. ఇది ప‌క్క‌న పెడితే సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly)  పుట్టిన రోజు ఇవాళ‌. స‌రిగ్గా జూలై 8 1972లో బెంగాల్ లో పుట్టాడు. అత‌డికి బెంగాల్ టైగ‌ర్ , దాదా అని కూడా ముద్దు పేర్లు ఉన్నాయి.

కోల్ క‌తాకు చెందిన ఈ క్రికెట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే గంగూలీకి ఎక్కువ‌గా చాన్స్ ఇచ్చింది భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టిన హైద‌రాబాదీ మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్.

ఇదే స‌మ‌యంలో అజ్జూ భాయ్ త‌ర్వాత కెప్టెన్సీ చేప‌ట్టిన గంగూలీ త‌న‌దైన శైలిలో జ‌ట్టును న‌డిపించాడు. దూకుడు స్వ‌భావం ఎక్కువ‌.

ఓట‌మిని ఒప్పుకోని మ‌న‌స్త‌త్వం గంగూలీది. ఎడ‌మ చేతి బ్యాట‌ర్, బౌల‌ర్ కూడా.

కోల్ క‌తా యువ రాజుగా కూడా పిలుచుకుంటారు బెంగాలీ వాసులు. 2002 నుంచి 2005 దాకా భార‌త జ‌ట్టుకు నాయ‌కుడిగా ఉన్నాడు. అత్య‌ధిక టెస్టు విజ‌యాలు సాధించి పెట్టాడు.

2003లో ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ లో ఫైన‌ల్ కు కూడా చేర్చాడు. 2006లో జ‌ట్టుకు దూర‌మైనా ద‌క్షిణాఫ్రికా టూర్ లోకి ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటాడు గంగూలీ. 2008లో ఆసిస్ తో జ‌రిగిన టెస్టు సీరీస్ తో గుడ్ బై చెప్పాడు. కోల్ క‌తా ధ‌న‌వంతుల్లో తండ్రి చండీదాస్ ఒక‌డు.

పేరెంట్స్ కు క్రికెట్ ఆడ‌టం ఇష్టం లేదు. కానీ అన్న స్నేహ శీష్ ఇచ్చిన స‌పోర్ట్ తో ఎంట్రీ ఇచ్చాడు. అండ‌ర్ -15 జ‌ట్టు త‌ర‌పున ఆడాడు.

1990-91 రంజీ సీజ‌న్ లో ఎంట్రీ ఇచ్చాడు.

1993-94, 1994-95 సీజ‌న్ లో అనేక ర‌న్స్ చేశాడు. 1995-96 లో దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో 171 ర‌న్స్ చేశాడు. అజ్జూతో సిద్దూ గొడ‌వ‌కు

దిగ‌డంతో అత‌డి స్థానంలో గంగూలీ(Sourav Ganguly)  వ‌చ్చాడు.

లార్డ్స్ లో సెంచ‌రీ సాధించాడు. 131 ర‌న్స్ చేశాడు. టెంట్ బ్రిడ్జి టెస్టులో 136 ర‌న్స్ చేశాడు. స‌చిన్ తో క‌లిసి 255 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు.

ఈ రికార్డు ఇప్ప‌టికీ అలాగే ఉంది గంగూలీ మీద‌. అన్ని ఫార్మాట్ లు క‌లిపి 11 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు గంగూలీ.

Also Read : ‘బెంగాల్ టైగ‌ర్’ కు బ‌ర్త్ డే విషెస్

Leave A Reply

Your Email Id will not be published!