Sourav Ganguly : క్యాబ్ అధ్యక్ష ఎన్నిక నుంచి గంగూలీ అవుట్
బీసీసీఐ మాజీ చీఫ్ షాకింగ్ నిర్ణయం
Sourav Ganguly : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ఎన్నికల నుండి వైదొలిగాడు. సోమవారం ఈ కీలక ప్రకటన చేశాడు. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ రేసులో ఉంటాడని భావించారు.
కానీ బీసీసీఐ నుంచి సరైన సహకారం అందలేదు. బీసీసీఐ బాస్ గా ఉండేందుకు చివరి వరకు ట్రై చేశాడు. కానీ రాజకీయాల కారణంగా గత్యంతరం లేక తప్పుకోవాల్సి వచ్చింది.ఈ తరుణంలో తాజాగా క్యాబ్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ లో ఉంటానని గతంలో ప్రకటించిన సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఉన్నట్టుండి తప్పు కోవడం కీలకంగా మారింది.
ఇదిలా ఉండగా క్యాబ్ అపెక్స్ బాడీకి రాక ముందు దాదా 2015 నుండి 2019 వరకు నాలుగేళ్ల పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జరిగే క్యాబ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు సౌరవ్ గంగూలీ.
తనకు బదులుగా తన అన్నయ్య స్నేహాశిష్ కొత్తగా క్యాబ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నేను ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పోటీ చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు జరగడం లేదు. దీంతో పోటీ అన్నది లేకుండా పోయిందన్నారు. ఈనెల 22న చివరగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండింది.
కానీ తను దాఖలు చేయలేదు. మూడేళ్ల పాటు ఎన్నికైన వారు పని చేస్తారు. వారికి నేను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు సౌరవ్ గంగూలీ.
Also Read : కోహ్లీ అద్భుతం భారత్ విజయం – మోదీ