Sourav Ganguly : మైదానంలోకి దిగనున్న ‘బెంగాల్ టైగర్’
మనసు మార్చుకున్న బీసీసీఐ చీఫ్ దాదా
Sourav Ganguly : దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతోంది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది మోదీ ప్రభుత్వం. ఇందు కోసం చారిటీ ఫండ్ రైజింగ్ కోసం మ్యాచ్ చేపట్టాలని సర్కార్ బీసీసీఐని సంప్రదించింది.
ఈ మేరకు బీసీసీఐ చీఫ్ దాదా లైన్ క్లియర్ ఇచ్చేశాడు. వచ్చే ఆగస్టు 22న భారత్ ఎలెవెన్ , రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించింది బీసీసీఐ.
అయితే తాను ఈ చారిటీ మ్యాచ్ లో ఆడడం లేదంటూ డిక్లేర్ చేశాడు దాదా. కానీ ఎందుకనో మనసు మార్చుకున్నాడు. మరోసారి మైదానంలో దిగేందుకు రెడీ అయ్యాడు.
ఈ మేరకు ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాడు. ఏకంగా జిమ్ లో బిజీగా మారాడు. బీసీసీఐ చీఫ్ గా ఫుల్ బిజీగా ఉండడం కారణంగా సమయం కుదరడం లేదని మొదట భావించాడు దాదా.
కానీ దేశం కోసం ఆమాత్రం ఆడక పోతే జనంతో పాటు అభిమానులు అనుమానించే అవకాశం ఉందని డెసిషన్ మార్చుకున్నట్లు సమాచారం. దీంతో బెంగాలీలు ముద్దుగా సౌరవ్ గంగూలీని(Sourav Ganguly) బెంగాల్ టైగర్ అని పిలుచుకుంటారు.
ట్విట్టర్ వేదికగా తాను ఆడుతున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా బీసీసీఐ బాస్ హోదాలో ఉంటూ ఆడుతున్న తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.
అంతే కాకుండా లెజెండ్స్ లీగ్ క్రికెట్ లీగ్ లో కూడా ఆడతానంటూ తెలిపాడు దాదా. కాగా అభిమానులు మాత్రం దాదా ఆట కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Also Read : టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్