Sourav Ganguly : లంకలో కాదు యూఏఈలో ఆసియా కప్
ప్రకటించిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ
Sourav Ganguly : భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ సంచలన ప్రకటన చేశారు. ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించడం లేదని చెప్పారు.
ఆ దేశంలో చోటు చేసుకున్న సంక్షోభం ఇంకా సమసి పోలేదని, శాంతి భద్రతలను పరిగణలోకి తీసుకుని ప్రతిష్టాక్మకమైన ఆసియా కప్ ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు గంగూలీ(Sourav Ganguly).
లంక ప్రీమియర్ లీగ్ ను శ్రీలంక క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. వాస్తవానికి శ్రీలంక వేదికగా జరగాల్సి ఉంది ఆసియా కప్. ప్రస్తుతం అక్కడ ఆడే పరిస్థితులు లేక పోవడంతో యూఏఈకి తరలించినట్లు స్పష్టం చేశాడు బీసీసీఐ(BCCI) బాస్.
ముంబైలో బోర్డు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొన్నారు. అనంతరం సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి అడ్డంకులు లేకుండా వర్షాలకు తావు లేని ప్రదేశం ఏదైనా ఉందంటే అది యూఏఈ ఒక్కటే శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా రాబోయే ఆసియా కప్ టి20 ఎడిషన్ కు ఆతిథ్యం ఇచ్చే స్థితిలో లేమంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు తెలియ చేసిందని చెప్పారు.
ఇదిలా ఉండగా ఆసియా కప్ వచ్చే ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 11 దాకా టి ఫార్మాట్ లో కొనసాగుతుందన్నారు గంగూలీ(Sourav Ganguly). 2022-23 సీజన్ కు సంబంధంచిన వివిధ ఎంపికలపై కూడా చర్చించామన్నారు.
పూర్తిగా దేశీయ సీజన్ జరుగుతుందని తెలిపారు. పురుషుల సీనియర్ సీజన్ ను సెప్టెంబర్ 8 నుంచి ఆడేందుకు చాన్స్ ఉన్న దులీప్ ట్రోఫీతో ప్రారంభించాలని బోర్డు యోచిస్తోందన్నారు.
అక్టోబర్ 1 నుండి 5 దాకా ఇరానీ ట్రోఫీ నిర్వహించాలని నిర్ణయించామన్నారు గంగూలీ. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీలకు ఆతిథ్యం ఇచ్చే ఎంపికలపై కూడా చర్చించామన్నారు.
Also Read : కోహ్లీకి రెస్ట్ ఇవ్వడం తప్పుడు సంకేతం