Sourav Ganguly : రోహిత్ కెప్టెన్సీపై దాదా గుస్సా
బౌలర్ల తీరుపై ఆగ్రహం
Sourav Ganguly : ఇంగ్లండ్ లోని ఓవెల్ లో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. భారీ స్కోర్ చేసింది. ప్రధానంగా భారత బౌలర్లు తేలి పోయారు. ఆసిస్ జట్టులో ఇద్దరు సెంచరీలతో కదం తొక్కారు. ట్రావిస్ హేడ్ దంచి కొడితే స్టీవ్ స్మిత్ అసాధారణమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
స్మిత్ తన కెరీర్ లో అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 31 సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై డాన్ బ్రాడ్ మన్ 11 సెంచరీలు చేస్తే స్మిత్ 7 సెంచరీలు చేయడం విశేషం. ఇదే సమయంలో రాహుల్ ద్రవిడ్ ను దాటేశాడు. ఇక విరాట్ కోహ్లీ 28 సెంచరీలతో ఉన్నాడు.
ఇదిలా ఉండగా త్వర త్వరగా మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత హేడ్ , స్మిత్ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆపై భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. పరుగుల వరద పారించారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).
ఆయన స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు. రోహిత్ శర్మ నాయకత్వ లోపం ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఇది టెస్టు మ్యాచ్ అని ఐపీఎల్ మ్యాచ్ కాదని ఎద్దేవా చేశాడు. ఇదిలా ఉండగా బౌలర్లను కూడా ఏకి పారేశాడు. మొత్తంగా రోహిత్ నిర్వాకం కారణంగానే ఆసిస్ బలమైన స్కోర్ సాదించ గలిగిందంటూ మండిపడ్డాడు గంగూలీ.
Also Read : Steve Smith Record : స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డ్