INDvsSA 2nd ODI : టెస్టు సీరీస్ తో పాటు వన్డే సీరీస్ కూడా కోల్పోయింది టీమిండియా. అనేక అంచనాల మధ్య ప్రారంభమైన సఫారీ సీరీస్ భారత్ కు ఓ పీడకల లాంటిదే.
మొదటి వన్డేలో 31 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకున్న భారత జట్టు రెండో వన్డే (INDvsSA 2nd ODI)లోనూ ప్రత్యర్థి జట్టును కట్టడి చేయలేక పోయింది. భారీ స్కోర్ సాధించినా ఆటగాళ్లను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా టీం కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయ బావుటా ఎగుర వేసింది.
ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సీరీస్ లో ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే సీరీస్ చేజిక్కించుకుంది. సఫారీ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు.
భారత జట్టులో కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్ , రిషబ్ పంత్ రాణిస్తే దక్షిణాఫ్రికా టీమ్ లో జానే మన్ మలన్ దుమ్ము రేపాడు. ఏకంగా 91 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇక క్వింటన్ డికాక్ ఎప్పటి లాగే అటాకింగ్ మొదలు పెట్టాడు. మనోడు ఏకంగా 78 పరుగులు చేస్తే కెప్టెన్ బవుమా మరోసారి 35 పరుగులు చేసి పని పూర్తి కానిచ్చేశాడు.
చివరలో మార్క్రమ్ 35 పరుగులతో, డసెన్ 34 పరుగులతా నాటౌట్ గా నిలిచి గెలుపులో కీలక పాత్ర పోషించారు. బుమ్రా, భువీ, చహల్ తలా వికెట్ తీశారు.
Also Read : కనేరియా సంచలన కామెంట్స్