Park Jin Naatu Naatu : పార్క్ జిన్ నోట నాటు నాటు పాట

దక్షిణ కొరియాలో సైతం సాంగ్ వైర‌ల్

Park Jin Naatu Naatu : భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తున్న ద‌క్షిణ కొరియా విదేశాంగ శాఖ మంత్రి పార్క్ జిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న జాతిపిత మ‌హాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

ఇటీవ‌ల ద‌ర్శ‌క ధీరుడు తీసిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ మోస్ట్ పాపుల‌ర్ గా నిలిచింది. ఆస్కార్ అవార్డు కూడా ద‌క్కించుకుంది. ఇదిలా ఉండ‌గా ఈ నాటు నాటు పాట(Park Jin Naatu Naatu) ద‌క్షిణ కొరియాలో కూడా హ‌ల్ చ‌ల్ చేసింది. ఇదే విష‌యాన్ని ఇవాళ స్వ‌యంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ప్ర‌స్తావించ‌డం విశేషం.

త‌మ దేశంలో నాటు నాటు సాంగ్ ను ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నార‌ని చెప్పారు. అంతే కాదు కొరియ‌న్ ఎంబ‌సీలో నాటు నాటు ప్ర‌ద‌ర్శ‌న కూడా చేశార‌ని తెలిపారు. ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డానికి ఇలాంటి పాట‌లు ఉప‌యోగ ప‌డుతాయ‌ని చెప్పారు పార్క్ జిన్.

కాగా భార‌త్ , ద‌క్షిణ కొరియా దేశాల మ‌ధ్య 50 ఏళ్లు దౌత్య సంబంధాలు పూర్తయ్యాయి. ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. మీకు తెలుసా నాటు నాటు సాంగ్ డ్యాన్స్ కొరియాలో చాలా ప్రాచుర్యం పొందింద‌ని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. ఇది అద్భుత‌మైన చిత్ర‌మ‌ని కొనియాడారు.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైర‌వ ఆ పాట‌ను పాడారు. ప్ర‌పంచ వ్యాప్తంగా నాటు నాటు పాట అత్యంత ఆద‌ర‌ణ పొందింది. దీనికి రామ్ చ‌ర‌ణ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించారు.

Also Read : వేణు ఖాతాలో మ‌రో అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!