SP Rishanth Reddy : పోలీసుల‌పై దాడి బాధాక‌రం – ఎస్పీ

వై. రిశాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

SP Rishanth Reddy : మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పుంగ‌నూరులో శుక్ర‌వారం పెద్ద ఎత్తున వైసీపీ, టీడీపీ శ్రేణుల మ‌ధ్య రాళ్ల వ‌ర్షం కురిసింది. ఇరు వ‌ర్గాల‌ను శాంతింప చేసేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌పై దాడుల‌కు దిగారు. చాలా మంది పోలీసుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంద‌ర్భ‌గా పుంగ‌నూరు జిల్లా ఎస్పీ వై. రిషాంత్ రెడ్డి(SP Rishanth Reddy) వెంట‌నే బాధిత పోలీసుల‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. పోలీసుల‌పై దాడి జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. దాడుల‌కు పాల్ప‌డిన వారు ఎంత‌టి వారైనా స‌రే ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఎస్పీ.

SP Rishanth Reddy Comments

నారా చంద్ర‌బాబు నాయుడుపై షాకింగ్ కామెంట్స్ చేశారు రిషాంత్ రెడ్డి. పుంగ‌నూరులో ప‌ర్య‌టించేందుకు ముంద‌స్తుగా ఎటువంటి అనుమతి తీసుకోలేద‌ని చెప్పారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వారు ఇచ్చిన కార్య‌క్ర‌మం ప్రకారం 400 మంది సిబ్బందితో బందోబ‌స్తు ఏర్పాటు చేశామ‌న్నారు జిల్లా ఎస్పీ. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను దృష్టిలో ఉంచుకుని త‌గిన విధంగా సెక్యూరిటీ క‌ల్పించామ‌న్నారు. చివ‌ర‌కు త‌మ వారిపై దాడికి దిగ‌డం దారుణ‌మ‌న్నారు ఎస్పీ.

పుంగ‌నూరు లోకి రాకుండా హైవేపై చిత్తూరుకు వెళ్లాల్సి ఉంద‌న్నారు. కొంద‌రి అల్ల‌రి మూక‌లు ముందుగానే ప్లాన్ ప్ర‌కారం దాడుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు ఎస్పీ. వారి ప‌ని ప‌డతామంటూ హెచ్చ‌రించారు.

Also Read : Rahul Gandhi : అంతిమంగా న్యాయ‌మే గెలుస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!