Rajinikanth AR Rahman Visits : పెద్ద ద‌ర్గాలో త‌లైవా..రెహ‌మాన్

ప్రార్థ‌న‌లు చేసిన న‌టుడు, సంగీత ద‌ర్శ‌కుడు

Rajinikanth AR Rahman Visits : ప్ర‌ముఖ న‌టుడు త‌లైవా ర‌జ‌నీకాంత్, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా రెహ‌మాన్ గురువారం తిరుమ‌ల‌ను సంద‌ర్శించుకున్నారు. అనంత‌రం ర‌హ‌దారి మార్గం ద్వారా క‌డ‌ప‌లో పేరొందిన పెద్ద ద‌ర్గాకు చేరుకున్నారు. అక్క‌డి వారికి ద‌ర్గా నిర్వాహ‌కులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

అంత‌కు ముందు తెల్ల‌వారుజామున త‌న కూతురుతో క‌లిసి త‌లైవా శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత స్వ‌ర‌క‌ర్త‌తో క‌లిసి జ‌ర్నీ చేశారు. సుప్ర‌భాతం సేవ‌లో ర‌జ‌నీకాంత్ , కూతురు పాల్గొన్నారు. ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టి లాగే సాదా సీదాగా ద‌ర్శ‌నం చేసుకున్నారు.

త‌న రాబోయే చిత్రం జైల‌ర్ నుండి త‌న లుక్ లో భాగ‌మైన గ‌డ్డాన్ని కూడా ధ‌రించాడు. ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్ త‌న 72వ పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. మూడు రోజుల త‌ర్వాత సూప‌ర్ స్టార్ కూతురుతో పూజ‌లు చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ మీడియాతో మాట్లాడారు. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న గురించి తాను మాటల్లో చెప్ప‌లేన‌న్నారు.

న‌టుడు, రాజ‌కీయ‌వేత్త ఉద‌య‌నిధి స్టాలిన్ కు మంత్రి ప‌ద‌వి రావ‌డం ప‌ట్ల మీ అభిప్రాయం చెప్ప‌మ‌ని అడుగ‌గా ఇప్ప‌టికే తాను అత‌డికి శుభాకాంక్ష‌లు తెలియ చేసిన‌ట్లు చెప్పారు. ర‌జ‌నీకాంత్ , కూతురుతో క‌లిసి క‌డ‌ప‌లో పేరొందిన పెద్ద దర్గాను రెహ‌మాన్(Rajinikanth AR Rahman)  తో క‌లిసి సంద‌ర్శించారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా పెద్ద ద‌ర్గాను సంద‌ర్శించ‌డం రెహ‌మాన్ కు అల‌వాటుగా మారింది. ఆయ‌న నెల్లూరు ద‌ర్గాకు కూడా వెళ‌తారు. అయితే నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ సినిమా చేస్తున్నారు. దీనిని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

Also Read : స్వామి మ‌హ‌రాజ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!