Narayana : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఇప్పుడు రాజకీయాలకు వేదికలుగా మారాయని ఆరోపించారు.
ఇవాళ ఆయన మీడియాతో మట్లాడారు. దేశ రాజకీయాలు ప్రస్తుతం మారి పోయాయని అవన్నీ గోపురాలు, సాధువుల చుట్టూ తిరుగుతున్నాయని మండిపడ్డారు.
పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నలలో దేశం నడుస్తోందంటూ ధ్వజమెత్తారు నారాయణ(Narayana). ప్రభుత్వ ఆస్తులను అప్పన్నంగా అమ్ముకుంటూ పోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
ఇక పంజాబ్ లో ఓట్ల కోసం డేరా బాబా అనే నరహంతకుడిని బీజేపీ జైలు నుంచి విడుదల చేయించిందని మండిపడ్డారు.
ఇంకో వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ను బెయిల్ పై విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక దేశ, రాష్ట్ర రాజకీయాలకు చిన్న జీయర్ స్వామి కేరాఫ్ గా మారారని ఫైర్ అయ్యారు. సాధు జంతువుగా ఉన్న చిన్న జీయర్ ఇప్పుడు రాజకీయ జంతువుగా మారాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
స్వామి ఆశ్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం వల్ల కేసీఆర్ సీఎం పదవికి ప్రమాదం పొంచి ఉందన్నారు. స్వాముల జోక్యం వల్ల రాజకీయాలు భ్రష్టు పట్టాయని అన్నారు నారాయణ.
వీళ్లంతా మేక వన్నె పులుల్లా తయారయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : కేసీఆర్ పని ఖతం పీకేకు కష్టం