Javed Akthar : భారతీయ సినీ వాలిలో మేరునగధీరుడిగా పేరొందారు జావేద్ అక్తర్. ఒకటా రెండా ఎన్నో పాటలు రాశారు. ఇప్పటికే కాదు ఎల్లప్పటికీ గుర్తుంచుకునేలా అందించారు. ఆయన కలానికి పొగరే కాదు ప్రేమ కూడా ఉంది.
ఇవాళ జావేద్ భాయ్ పుట్టిన రోజు . 1945 జనవరి 17న జన్మించారు. కవి, గీత రచయిత, స్క్రీన్ రైటర్, రాజకీయ కార్యకర్త కూడా.
భిన్నమైన పాత్రల్లో తనదైన గుర్తింపు పొందారు జావేద్ అక్తర్(Javed Akthar ). ఐదు జాతీయ అవార్డులు వరించాయి.
లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన అందించిన సేవలకు గాను 1999లో పద్మశ్రీ, 2007లో పద్మ భూషణ్ తో సత్కరించింది. అక్తర్ సలీం – జావేద్ ద్వయంలో గుర్తింపు పొందాడు.
1973 లో వచ్చిన జంజీర్ తో స్క్రీన్ రైటర్ గా ప్రారంభించాడు. దీవార్, షోలే చిత్రాలకు కూడా రాశాడు.
ఈ రెండు సినిమాలు 1975లో విడుదలయ్యాయి. భారత దేశాన్ని ఊపు ఊపాయి.
షోలే ఇప్పటకీ ఎవర్ గ్రీన్ మూవీగా రికార్డు సృష్టించింది. గీత రచయితగా ప్రశంసలు అందుకున్నాడు.
ఎనిమిది సార్లు ఉత్తమ గీత రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందాడు. జావేద్ అక్తర్ (Javed Akthar )కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున 2019లో ప్రచారం చేశాడు.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2020లో రిచర్డ్ డాకిన్స్ అవార్డు అందుకున్నాడు.
గ్వాలియర్ లో పుట్టిన జావేద్ అక్తర్ తండ్రి జాన్ నిసార్ అక్తర్ బాలీవుడ్ సినీ పాటల రచయిత. ఉర్దూ కవి. జావేద్ అసలు పేరు జాదూ.
జావేద్ అక్తర్ కు అవకాశం కల్పించింది మాత్రం రాజేష్ ఖన్నాకు దక్కుతుంది. అందాజ్ , హాథీ మేరా సాథీ, సీతా ఔర్ గీతా, యాదోన్ కీ బారాత్ , జంజీర్ , హాత్ కీ సఫాయ్ , దీవార్ , షోలే, చాచా భటీజా, డాన్ , త్రిశూల్ వంటి సినిమాలు హిట్ అయ్యాయి.
పలు సినిమాలకు జావేద్ సలీం కలిసి పని చేశారు. వీరిద్దరూ 24 సినిమాలకు రాస్తే 20 భారీ సక్సెస్ అయ్యాయి. 1982లో వీరిద్దరూ విడి పోయారు.
భారతీయ సినిమాలో స్టార్ హోదాను సాధించిన స్క్రిప్ట్ రైటర్ గా కూడా పేరొందారు. ఉర్దూ కవి కైఫీ ఆజ్మీ కూతురు షబానా ఆజ్మీని పెళ్లి చేసుకున్నాడు.
Also Read : బహుజనుల స్వరం మాయావతి సంచలనం