Sree Leela Allu ArjunViral : బన్నీతో శ్రీలీల చిత్రం
ఫోటోలు నెట్టింట్లో వైరల్
Sree Leela Allu ArjunViral : అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఉన్నట్టుండి టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరింది. రవితేజ తో తీసిన మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకు ముందు దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన చిత్రం తో మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా సినిమాలు చేస్తూ పోతోంది. ప్రత్యేకించి టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది. దీనికి దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదల చేసింది. భారీ రెస్పాన్స్ వస్తోంది. జూన్ 14న నటి శ్రీలీల పుట్టిన రోజు.
ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. భారీ ఎత్తున లైక్ లు, కామెంట్స్ వస్తున్నాయి. మరో వైపు ఇంకో ప్రకటన చేసింది ఆహా సంస్థ. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రత్యేకించి సినిమా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం కీలక ప్రకటన చేసింది ఆహా. శ్రీలీల, అల్లు అర్జున్(Allu Arjun) కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసింది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీతో సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాలు అద్భుతంగా నడిచాయి.
తాజాగా ఆహా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయడం విశేషం. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బన్నీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప దుమ్ము రేపింది. ప్రస్తుతం పుష్ప -2 వస్తోంది. దానికి సంబంధించి త్వరలోనే అప్ డేట్ రానుంది. మొత్తంగా శ్రీలీల ఇప్పుడు వైరల్ కావడం విశేషం.
Also Read : Venkattram Reddy Arrest : వెంకట్రామ్ రెడ్డి అరెస్ట్
