Sree Leela First Look : శ్రీ‌లీల ఫ‌స్ట్ లుక్ కెవ్వు కేక

గుంటూరు కారం నుంచి రిలీజ్

Sree Leela First Look : ముద్దుగుమ్మ శ్రీ‌లీల పుట్టిన రోజు జూన్ 14. ఈ సంద‌ర్భంగా గుంటూరు కారం మూవీ మేక‌ర్స్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు , శ్రీ‌లీల ఫ్యాన్స్ కు జోష్ తెప్పించేలా న‌టి శ్రీలీల‌కు సంబంధించిన సినిమా పోస్ట‌ర్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన టీజ‌ర్ కు భారీ స్పంద‌న వ‌చ్చింది.

తెలుగు సినిమా రంగంలో మాట‌ల మాంత్రికుడిగా పేరు పొందిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్నాడు. ఇద్ద‌రికీ ఈ సినిమా అత్యంత ముఖ్యం. ఇప్ప‌టి వ‌ర‌కు త్రివిక్రమ్ మ‌హేష్ తో అత‌డు, ఖ‌లేజా తీశాడు. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు గుంటూరు కారం పేరును ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

మహేష్ బాబు తో పాటు ఇద్ద‌రు ఇందులో కీల‌క పాత్ర పోషిస్తారు. వారిలో ఒక‌రు ల‌వ్లీ గ‌ర్ల్ పూజా హెగ్డే కాగా మ‌రొక‌రు మిల్కీ బ్యూటీ శ్రీ‌లీల‌(Sri Leela). ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో విడుద‌ల చేయనున్న‌ట్లు స‌మాచారం. ఇక టేకింగ్ లో , డైలాగ్ లు పేల్చ‌డంలో త‌న‌కు త‌నే సాటి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఇక ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం కంటే న్యాయం చేసే ద‌మ్మున్నోడు న‌టుడు మహేష్ బాబు.

వీరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డి పోతున్నారు. టీజ‌ర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందోన‌ని చ‌ర్చించుకుంటున్నారు. మొత్తంగా శ్రీ‌లీల , పూజా హెగ్డేల అందం, మ‌హేష్ న‌ట‌న‌తో గుంటూరు కారం మ‌రింత స్పైసీగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

Also Read : Pawan Kalyan : స‌త్య‌దేవుని స‌న్నిధిలో జ‌న‌సేనాని

 

Leave A Reply

Your Email Id will not be published!