SRH Retention List : కేన్..పూరన్ కు స‌న్ రైజ‌ర్స్ దెబ్బ

12 మంది ఆట‌గాళ్లు విడుద‌ల

SRH Retention List : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో అత్యంత ఎక్కువ‌గా ట్రోల్ కు గుర‌వుతున్న జ‌ట్టు ఏదైనా ఉందంటే అది స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్ . జ‌ట్టు యాజ‌మాన్యం మారినా దాని త‌ల రాత మార‌లేదు. ఉన్న‌ట్టుండి డేవిడ్ వార్న‌ర్ ను సాగ‌నంపింది. మ‌నోడిని అనూహ్యంగా త‌ప్పించింది.

ఆపై అవ‌మానానికి గురి చేసింది. కానీ ఏ జ‌ట్టు అయితే త‌న‌ను ఛీత్క‌రించిందో అదే జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు స్టార్ హిట్ట‌ర్ వార్న‌ర్. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఏకంగా ఆస్ట్రేలియా టైటిల్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. కోల్పోయిన ఫామ్ ను తిరిగి తెచ్చుకున్న వార్న‌ర్ ఇప్పుడు మ‌రోసారి స‌త్తా చాటేందుకు రెడీ అయ్యాడు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌డిని స్వంతం చేసుకుంది. ఈసారి కూడా అట్టే పెట్టుకుంది. ఈ త‌రుణంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది స‌న్ రైజ‌ర్స్(SRH Retention List) సిఇఓ. ఏకంగా తొమ్మిది మంది ఆటగాళ్ల‌ను వ‌దులుకుంది.

ఇక ఈసారి స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు త‌రపున ఎయిడెన్ మార్క్ ర‌మ్ , రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్ , అబ్దుల్ స‌మ‌ద్ , అభిషేక్ శ‌ర్మ‌, మార్కో జాన్సెన్ , వాషింగ్ట‌న్ సుంద‌ర్ , కార్తీక్ త్యాగి, టి. న‌ట‌రాజ‌న్ , ఫ‌రూఖీల‌ను అలాగే ఉంచుకుంది.

మ‌రో వైపు కేన్ విలియ‌మ్స‌న్ తో పాటు నికోల‌స్ పూర‌న్ , జ‌గ‌దీశ్ సుచిత్ , ప్రియ‌మ్ గార్గ్ , ర‌వి కుమార్ స‌మ‌ర్థ్ , రొమారియో షెఫ‌ర్డ్ , సౌర‌భ్ దూబే, సీన్ అబాట్ , శ‌శాంక్ సింగ్ , శ్రేయాస్ గోపాల్ , సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ల‌ను విడిచి పెట్టింది.

Also Read : సీనియ‌ర్ల‌కు ఆర్సీబీ మ‌రోసారి ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!