SRH vs LSG IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ఇవాళ ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది.
జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ , స్టార్ ప్లేయర్ దీపక్ హుడా రాణించడంతో లక్నో 7 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు 170 పరుగుల టార్గెట్ ఉంచింది.
ఇక స్కిప్పర్ కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసి టాప్ లో నిలిస్తే దీపిక్ హుడా 54 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. ఒకానొక దశలో లక్నో వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
కానీ కెప్టెన్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది లక్నో. ఇక ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో నటరాజన్ , షెపర్డ్ , వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇదిలా ఉండగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగులకే ముచ్చటగా మూడు వికెట్లును కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
ఈ తరుణంలో స్కోర్ ను మెల మెల్లగా పరుగులు తీసేలా చేశారు రాహుల్ , హుడా. ఇక లీగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs LSG IPL 2022) ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్ లు ఓడి పోయి ఇబ్బందుల్లో ఉంది. ఏ జట్టు అయినా ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కనీసం 5 మ్యాచ్ లు గెలవాల్సి ఉంది. ఏది ఏమైని ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
Also Read : గెలిస్తే బెటర్ లేక పోతే కష్టం