ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా శనివారం కీలక మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. పాయింట్ల పట్టికలో లక్నో గెలిస్తే 4వ స్థానంలో నిలుస్తుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గనుక విజయం సాధిస్తే మరో అడుగు ముందుకు వెళుతుంది. ఇప్పటి దాకా 10 మ్యాచ్ లు ఆడింది. 4 మ్యాచ్ లలో గెలుపొందగా 6 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం 5వ స్థానంలో నిలిచింది. 11 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ లు గెలుపొందగా 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా నిలిచి పోవడంతో ఒక పాయింట్ సాధించింది.
మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా స్కిప్పర్ గా ఉన్నాడు లక్నోకు. ఇక జట్ల పరంగా చూస్తే హైదరాబాద్ జట్టులో ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ కాగా మయాంక్ మార్కండే, హెన్రిచ్ క్లాసెస్ , భువనేశ్వర్ కుమార్ , అభిషేక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్ , రాహుల్ త్రిపాఠి, మార్కో జాన్సెన్ , టి. నటరాజన్ , అబ్దుల్ సమద్ , వివ్రంత్ శర్మ ఉండగా ఇంపాక్ట్ ప్లేయర్లుగా హెచ్ సీ బ్రూక్ ,మయాంక్ దాగర్, అన్మోల్ ప్రీత్ సింగ్ , నితీశ్ రెడ్డి, సన్వీర్ సింగ్ ఆడతారు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కృనాల్ పాండ్యా కెప్టెన్ కాగా డికాక్ , కైల్ మేయర్స్ , దీపక్ హూడా, కరణ్ శర్మ , మార్కస్ స్టోయినిస్ , యశ్ ఠాకూర్ , రవి బిష్ణోయ్ , మోహిషిన్ ఖాన్ , అవేష్ ఖాన్ , స్వప్నిల్ సింగ్ ఆడనున్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ఆయుష్ బడోని, ప్రేరక్ మన్కడ్ , డేనియల్ సామ్స్ , అమిత్ మిశ్రా , మిధ్వార్ సింగ్.
