SRH vs RCB IPL 2023 : హైదరాబాద్ బెంగళూరు బిగ్ ఫైట్
లీగ్ లో కీలక పోరుకు ఇరు జట్లు రెడీ
SRH vs RCB IPL 2023 : పోరాడితే పోయేది ఏమీ లేదని అనుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలకం కానుంది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం.
హైదరాబద్ కంటే బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ లో టాప్ లో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 12 పాయింట్తో ఉంది. ప్లే ఆఫ్ కు చేరాలంటే రాబోయే రెండు మ్యాచ్ లలో విధిగా గెలవాల్సి ఉంటుంది. మరో వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచ్ లలో 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తో పాటు విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు అదనపు బలం.
డుప్లెసిస్ 12 గేమ్ల నుండి 57.36 సగటుతో 631 పరుగులతో రన్ గెటర్స్ జాబితాలో టాప్ లో ఉన్నాడు. కోహ్లీ ఆరు హాఫ్ సెంచరీలతో 438 రన్స్ చేశాడు. ఆర్సీబీ చివరి మ్యాచ్ లో 112 పరుగుల భారీ తేడాతో బెంగళూరు అద్భుత విజయాన్ని సాధించింది.
ఇక సన్ రైజర్స్ ఎలాగైనా సరే ఆర్సీబీకి షాక్ ఇవ్వాలని గ్రాండ్ విక్టరీ నమోదు చేయాలని కోరుకుంటోంది. ఇక మైదానంలోకి దిగితే కానీ ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం.
Also Read : Atharva Tiade