SRH vs RCB IPL 2023 : బెంగ‌ళూరు భ‌ళా హైద‌రాబాద్ విల‌విల

8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

SRH vs RCB IPL 2023 : హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB)అసాధార‌ణ‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్ రేసులోకి దూసుకు వెళ్లింది. ఇప్ప‌టికే పేల‌వ‌మైన ఆట తీరుతో ఐపీఎల్ 16వ సీజ‌న్ నుంచి హైదరాబాద్ నిష్క్ర‌మించింది.

ఆ జ‌ట్టు అద్భుతంగా ఆడింది. భారీ స్కోర్ న‌మోదు చేసింది. కానీ ఆర్సీబీ(RCB) ఎక్క‌డా త‌గ్గ‌లేదు. సునాయ‌సంగా గెలుపును స్వంతం చేసుకుంది. ప్ర‌ధానంగా ఈ సీజ‌న్ లో ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ త‌న‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇప్ప‌టికే వ్య‌క్తిగ‌త ప‌రుగుల జాబితాలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. రాజ‌స్థాన్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను 112 ప‌రుగుల తేడాతో మ‌ట్టి క‌రిపించిన ఆర్సీబీ(RCB) హైద‌రాబాద్ లో ఎస్ ఆర్ హెచ్(SRH) ను 8 వికెట్ల తేడాతో ఓడించి విస్తు పోయేలా చేసింది. మెరుగైన ర‌న్ రేట్ ను న‌మోదు చేసింది.

ఈ విజ‌యంతో ఆర్సీబీ 14 పాయింట్లతో నాల్గో స్థానానికి చేరుకుంది. ఇక గుజ‌రాత్ పై గెలిస్తే ప్లే ఆఫ్స్ కు క‌చ్చితంగా వెళుతుంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే హైద‌రాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 185 ర‌న్స్ చేసింది. ఈ స్టేడియంలో ఇది భారీ స్కోర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆరెంజ్ ఆర్మీలో హెన్రిచ్ క్లాసెన్ మ‌రోసారి మెరిశాడు. అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 104 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ 27 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం 186 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సునాయ‌సంగా గెలిచింది. ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 71 ర‌న్స్ చేస్తే విరాట్ కోహ్లీ 100 సెంచ‌రీతో దుమ్ము రేపాడు. మ్యాక్స్ వెల్ 5 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిల‌వ‌గా బ్రేస్ వెల్ 4 ప‌రుగుల‌తో ఉన్నారు.

Also Read : Karnataka Chief Minister Comment

Leave A Reply

Your Email Id will not be published!