Sri Lanka Cricket Board : శ్రీ‌లంక క్రికెట్ బోర్డు ర‌ద్దు

ప్ర‌క‌టించిన శ్రీ‌లంక ప్ర‌భుత్వం

Sri Lanka Cricket Board : శ్రీ‌లంక – శ్రీ‌లంక ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ లో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. లంక జ‌ట్టు అత్యంత పేల‌వ‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. వ‌రుస ప‌రాజ‌యాల కార‌ణం చూపి ఏకంగా బోర్డును ర‌ద్దు చేస్తున్న‌ట్లు శ్రీ‌లంక క్రీడా శాఖ మంత్రి రోష‌న్ ర‌ణ సింగ్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

Sri Lanka Cricket Board Comment

ప్ర‌భుత్వ ప‌రంగా ఇప్ప‌టి వ‌ర‌కు నియ‌మించిన శ్రీ‌లంక క్రికెట్ బోర్డును(Sri Lanka Cricket Board) పూర్తిగా తొల‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఆర్థికంగా చితికి పోయిన శ్రీ‌లంక దేశంలో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రికెట్ బోర్డుగా పేరు పొందింది. ఇదిలా ఉండ‌గా 1996లో వ‌రల్డ్ క‌ప్ జ‌ట్టును గెలిపించిన మాజీ కెప్టెన్ అర్జున ర‌ణ‌తుంగ‌ను తాత్కాలిక బోర్డు చైర్మ‌న్ గా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఆతిథ్య జ‌ట్టు భార‌త్ చేతిలో శ్రీ‌లంక ఏకంగా 302 ర‌న్స్ తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో శ్రీ‌లంక దేశానికి చెందిన క్రీడాభిమానులు పెద్ద ఎత్తున శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు.

శ్రీ‌లంక బోర్డు అధికారుల‌కు నైతికంగా కొన‌సాగే హ‌క్కు లేద‌ని స్ప‌ష్టం చేశారు దేశ క్రీడా శాఖ మంత్రి ర‌ణ సింగ్.

Also Read : Heeralal Samariya : కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ గా హీరాలాల్

Leave A Reply

Your Email Id will not be published!