Sri Lanka Cricketers : శ్రీలంక సర్కార్ పై క్రికెటర్ల కన్నెర్ర
ప్రజాగ్రహానికి బేషరతుగా మద్దతు
Sri Lanka Cricketers : శ్రీలంక దేశం అట్టుడుకుతోంది. ఆహారం , ఇంధనం, నిత్యవసారాలు అందక ప్రజలు రోడ్లపైకి వచ్చారు. యువతీ యువకులు, ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దేశ అధ్యక్షుడు రాజపక్స అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కనిపిస్తే, తనను వ్యతిరేకించిన వాళ్లను కాల్చి వేయండంటూ ఆర్డర్స్ ఇచ్చారు.
ఇప్పటికే ప్రధాన మంత్రి మహింద రాజపక్స తో పాటు 26 మంది మంత్రులు రాజీనామా చేశారు.
ఈ తరుణంలో ప్రభుత్వంలో ప్రతిపక్షాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు శ్రీలంక ప్రెసిడెంట్. విపక్షాలు పూర్తిగా ప్రెసిడెంట్ ఆఫర్ ను తిరస్కరించారు.
ఆందోళన బాట పట్టారు. మిన్నంటిన నిరసనలు, ఆందోళనలు, ప్రజాగ్రహానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రికెటర్లు
మహేళ జయవర్దనే, కుమార సంగక్కర(Sri Lanka Cricketers). ప్రభుత్వ నాయకులు వెంటనే రాజీనామా చేయాలని కోరారు.
దేశం ఈ పరిస్థితికి దిగజారడానికి ప్రధాన కారణం మీరేనంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా ఉన్నారు జయవర్దనే,
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకు డైరెక్టర్ గా ఉన్నాడు కుమార సంగక్కర.
శ్రీలంక నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు వీరిద్దరూ. ఈ క్రికెటర్లకు ఎనలేని ఫాలోయింగ్ ఉంది శ్రీలంక దేశంలో. ట్విట్టర్ వేదికగా వారు తమ ఆవేదనను (Sri Lanka Cricketers)ప్రకటించారు.
ఇదే సమయంలో ఆందోళనకారులు, ప్రజలకు పూర్తి మద్దతు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్న కొందరు నేతలు ఫెయిల్ అయ్యారు. దేశాన్ని గాడిన పెట్టేందుకు సరైన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు సంగక్కర.
విచిత్రం ఏమిటంటే ఆయన భార్య కూడా ప్రజలతో కలిసి పోరాడుతోంది. నేను చాలా మైళ్ల దూరంలో ఉన్నా. ఐపీఎల్ లో ఆడుతున్నా కానీ నా మనసు మాత్రం శ్రీలంకలోనే ఉందన్నాడు పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సే.
నా హృదయం తట్టుకోలేక పోతోందన్నాడు సంగక్కర.
Also Read : పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ పవర్ ఫుల్