Sri Lanka Test Squad : భారత్ తో తలపడే శ్రీలంక టెస్టు క్రికెట్ టీమ్ ను ప్రకటించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. మొత్తం 18 మంది జట్టు సభ్యులను ఎంపిక చేసింది. ఇప్పటికే టీ20 సీరీస్ స్టార్ల్ అయ్యింది.
మొదటి మ్యాచ్ లక్నో లో జరగగా భారత జట్టు భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఈ తరుణంలో టెస్టు సీరీస్ లో భాగంగా భారత్ తో శ్రీలంక రెండు టెస్టులు(Sri Lanka Test Squad )ఆడనుంది.
ఇక అంతకు ముందు శ్రీలంక ఆసిస్ టూర్ లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేపట్టింది. పోయిన పరువును కాపాడు కోవాలని శ్రీలంక జట్టు శతవిధాలుగా యత్నిస్తోంది. కానీ భారత జట్టు వెస్టిండీస్ ను టీ20 తో పాటు వన్డే సీరీస్ కైవసం చేసుకుంది.
అన్ని ఫార్మాట్ లలో బలంగా కనిపిస్తోంది. సఫారీ టూర్ సందర్భంగా భారత జట్టు టెస్టు సీరీస్ ను కోల్పోయింది.
ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ సైతం రోహిత్ శర్మను మూడు ఫార్మాట్ లకు సారథిగా నియమించింది.
ఇదిలా ఉండగా శ్రీలంక జట్టు ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం అనంతరం భారత్ లో ఆడనుంది. 2017లో చివరి సారిగా టీమిండియాతో ఆడింది. సీనియర్ స్టార్ ప్లేయర్ మాథ్యుస్ తిరిగి వచ్చాడు.
సీనియర్ బౌలర్ లక్మల్ కు ఇదే చివరి సీరీస్ కానుంది. ఆ తర్వాత ఆట కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు.
అంతకు ముందు బీసీసీఐ టెస్టు సీరీస్ కోసం జట్టును ఎంపిక చేసింది.
తాజాగా శ్రీలం జట్టు ఇలా ఉంది. మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి స్టార్ట్ అవుతుంది.కరుణ రత్నే, నిస్సాంక, తిరమన్నె, ధనంజయ, కుసాల్ మెండీస్ , ఏంజెలో మాథ్యుస్ , దినేష్ చండిమాల్ , అసలంక, డిక్వెల్లా, కరుణ రత్నే, రమేష్ మెండీస్ , కుమార, సురంగ, దుష్మంత, ఫెర్నాండో, వాండర్సే, జయవిక్రమ, లసిత్ ఉన్నారు.
Also Read : తలవంచిన శ్రీలంక చెలరేగిన భారత్