KTR Meet : మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన శ్రీలంక మంత్రి సదాశివం
సదాశివంతో సమావేశం అనంతరం కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు...
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావుని శ్రీలంక మంత్రి సదాశివం ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధిపై కేటీఆర్‌ను ఆయన అభినందించారు. బీఆర్ఎస్ పనితీరు తమకు స్ఫూర్తిగా నిలిచిందని సదాశివం అన్నారు. ” మీ పాలన మాకు ఆదర్శం. బీఆర్‌ఎస్ పదేళ్లలో అనూహ్య ప్రగతి సాధించింది. గతంలో శ్రీలంక పార్లమెంట్‌లోనూ ఈ విషయాన్ని నేను ప్రస్తావించా. హైదరాబాద్ అభివృద్ధి సింగపూర్‌ను తలపించేలా ఉంది. మాజీ సీఎం కేసీఆర్.. కేటీఆర్(KTR) తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్‌గా మార్చారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే.. రాష్ట్రాన్ని అవకాశాల అక్షయపాత్రగా మార్చిన మీ తీరు మాకు స్ఫూర్తిదాయకం” అని సదాశివం పేర్కొన్నారు.
KTR Meet Sri Lanka Minister
సదాశివంతో సమావేశం అనంతరం కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన పనులను గుర్తు చేశాయన్నారు. ” తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిపై ఆయన నాతో సుదీర్ఘంగా చర్చించారు. పదేళ్ల అత్యల్ప కాలంలో రాష్ట్రం ఇంతగా పురోగమించడంపై గర్వంగా ఉంది. హైదరాబాద్‌ను అవకాశాల హబ్‌గా మార్చడంలో మా కృషిని గుర్తించినందుకు మంత్రి సదాశివంకు కృతజ్ఞతలు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ పాలన ఎంత అంకితభావంతో సాగిందో మంత్రి సదాశివం నాతో పంచుకున్నారు. బీఆర్ఎస్ సంపద సృష్టించడమే కాకుండా, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకున్న విషయాన్ని నేను ఆయనకి వివరించా”అని కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read : Infosys Narayana Murthy : పెరుగుతున్న జనాభా భారత్ కు మరో పెను సవాల్