Sri Lanka Victory : స‌మిష్టి కృషికి సంకేతం శ్రీ‌లంక విజ‌యం

అసాధార‌ణ విజ‌యం స్ఫూర్తి దాయ‌కం

Sri Lanka Victory : పొట్టి ఫార్మాట్ లో ఎవ‌రు ఎప్పుడు గెలుస్తారో చెప్ప‌డం క‌ష్టం. బంతికీ బ్యాట్ కూ మ‌ధ్య జ‌రిగే పోరాటంలో ఒక్కోసారి ఆశించిన జ‌ట్లు గెల‌వ‌క పోవ‌చ్చు.

అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగే జ‌ట్లు షాక్ కు గురి చేసేలా చేస్తాయి. ఇందుకు తాజా నిద‌ర్శ‌న‌మే యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ -2022. ఈ

మెగా టోర్నీలో ఈసారి ఆరు జ‌ట్లు పాల్గొన్నాయి.

టైటిల్ ఫేవ‌రేట్స్ గా పాకిస్తాన్, భార‌త్ ఉన్నా చివ‌ర‌కు పాకిస్తాన్, శ్రీ‌లంక మ‌ధ్య ఫైన‌ల్ పోరు జ‌రిగింది. ఆఫ్గ‌నిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, యూఏఈ,

హాంకాంగ్ , పాకిస్తాన్, శ్రీ‌లంక‌, భార‌త్ టోర్నీలో ఆడాయి. సూప‌ర్ -4 కు నాలుగు జ‌ట్లు చేరుకున్నాయి.

శ్రీ‌లంక‌, పాకిస్తాన్, భార‌త్, ఆఫ్గ‌నిస్తాన్. ప్రారంభ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చింది ఆఫ్గ‌నిస్తాన్. ఇక శ్రీ‌లంక ప‌నై పోయింద‌ని అంతా

అనుకున్నారు. కానీ ఇక్కడే అద్భుతం చోటు చేసుకుంది.

ప్ర‌తి మ్యాచ్ లోనూ గెలుస్తూ వ‌చ్చింది శ్రీ‌లంక‌. జ‌ట్టులో ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు రాణించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ఎక్క‌డా ఆందోళ‌న‌కు గురి కాలేదు.

పూర్తిగా సానుకూల దృక్ఫ‌థంతో త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ద్వీప దేశంలోని ల‌క్ష‌లాది మంది తిండి కోసం రోడ్లెక్కారు.

తీవ్ర‌మైన ఆర్థిక‌, రాజ‌కీయ‌, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ త‌రుణంలో శ్రీ‌లంక(Sri Lanka Victory) తమ దేశం కోసం ఆడింది. ఇది ఒక ర‌కంగా శ్రీ‌లంక దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచేలా చేసిన అసాధార‌ణ‌మైన స‌క్సెస్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

తీవ్ర‌మైన ఒత్తిళ్ల‌లోనూ ఎలా రాణించాలో శ్రీ‌లంక ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించింది. మితి మీరిన ఆత్మ విశ్వాసంతో మిడిసి ప‌డిన పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించింది.

ఇక మితి మీరిన ప్ర‌యోగాల‌తో రెచ్చి పోయిన భార‌త్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అటు బ్యాటింగ్ లో ఇటు ఫీల్డింగ్, బౌలింగ్ లో శ్రీ‌లంక స‌త్తా చాటింది.

మ్యాచ్ ల ప‌రంగా చూస్తే మొద‌ట బ్యాటింగ్ చేసినా ఆ త‌ర్వాత ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టి క‌రిపించింది. ఇక బౌలింగ్ చేసినా ఇత‌ర జ‌ట్ల‌ను త‌క్కువ స్కోర్ల‌కే క‌ట్ట‌డి చేసింది.

మొత్తంగా స‌మిష్టిగా స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగితే ..ఆడితే విజ‌యం త‌ప్ప‌క వ‌రిస్తుంద‌ని చేసి చూపించింది శ్రీ‌లంక‌(Sri Lanka Victory).

ఆ జ‌ట్టు సాధించిన విజ‌యం అపూర్వ‌మైన‌ది. చ‌రిత్రాత్మ‌క‌మైన‌ది. అంత కంటే ఆ దేశానికి ల‌భించిన గొప్ప గుర్తింపుగా భావించ‌క త‌ప్ప‌దు.

Also Read : లంక విజ‌యం మిన్నంటిన సంబురం

Leave A Reply

Your Email Id will not be published!