Appalayagunta : ఘ‌నంగా వేంక‌టేశ్వ‌రుడి ర‌థోత్స‌వం

క‌ల్కి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న శ్రీ‌నివాసుడు

Appalayagunta : అప్ప‌లాయ‌గుంటలో(Appalayagunta) కొలువు తీరిన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. గురువారంతో ముగుస్తున్నాయి. పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. శ్రీ‌నివాసుడు మాడ వీధుల్లో విహ‌రిస్తూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. ఇక ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి స్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై విహ‌రించారు. భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.

ఉప‌నిష‌త్తులు ఇంద్రియాల‌ను గుర్రాలుగా వ‌ర్ణిస్తున్నాయి. అశ్వాన్ని అధిరోహించిన ప‌రమాత్మ ఇంద్రియ నియామ‌కుడు. ప‌ర‌మాత్మ‌ను అశ్వ స్వ‌రూపంగా కృషి య‌జుర్వేదం తెలియ‌చేసింది. క‌లి దోషాల‌కు దూరంగా ఉండాల‌ని నామ సంకీర్త‌నాదుల‌ను ఆశ్ర‌యించి త‌ర‌లించాల‌ని ప్ర‌బోధిస్తున్నారు.

ఇదిలా ఉండగా సెల‌వులు కావ‌డంతో భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు పుణ్య క్షేత్రం తిరుమ‌ల కొండ‌కు. ప్ర‌తి రోజూ 75 వేల మందికి పైగా స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకుంటున్నారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 75,229 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

35,618 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ. 3.24 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. ద‌ర్శ‌నానికి సంబంధించి భ‌క్తులు 31 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Also Read : IND vs AUS WTC Final : చెల‌రేగిన హెడ్..స్టీవ్ స్మిత్

Leave A Reply

Your Email Id will not be published!